- Advertisement -
ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. నీటిమట్టం క్రమంగా పెరిగిపోతుండటంతో మూడో ప్రమాద హెచ్చరికలు జారీచేశారు.
భారీ వరదకు భద్రాచలం వద్ద శ్రీరాముడి ఆలయ అన్నదాన సత్రం, రామాలయం మెట్ల పైకి వరద వచ్చింది. ఆలయానికి చెందిన కల్యాణ కట్ట, స్నాన ఘట్టాలు నీట మునిగాయి.
వరద ఉదృతికి దుమ్ముగూడెంకు రాకపోకలు నిలిచిపోయాయి.దీంతో జనజీవనం పూర్తిగా స్తంభించింది. పలు గ్రామాలు నీటమునగడంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు.
- Advertisement -