గోవా సీఎం మనోహర్ పారికర్ మృతి

258
Manohar Parikar
- Advertisement -

గోవా సీఎం మనోహర్ పారికర్ కన్నుమూశారు. . గత కొంత కాలంగా క్లోమ గ్రంథి క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి ఆదివారం విషమించి తుదిశ్వాస విడిచారు. గత కొద్ది రోజులుగా ఆయన అమెరికాలో చికిత్స పొందారు. అయితే గత నెలలో ఆయన అనారోగ్యానికి గురకావడంతో వైద్యుల పర్యవేక్షనలో ఉన్నారు. పారికర్ మృతిపై రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ , ప్రధాని నరేంద్రమోడీ,ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు,బీజేపీ నేతలు,కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ,పలువురు నేతలు సంతాపం తెలియజేశారు.

ఆక్సీజన్ పైపుతోనే ఆయన తన విధులకు హాజరయ్యేవారని గుర్తు చేశారు రాష్ట్రపతి. మనోహర్ పారికర్ గోవాకు మొత్తం మూడు పర్యాయాలు సీఎంగా పనిచేశారు.గోవాలోని మపుసాలో పారికర్ జన్మించారు. 1994లో పారికర్ తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. .2000లో గోవా సీఎంగా తొలిసారిగా పారికర్ బాధ్యతలు చేపట్టారు. 2002 ఫిబ్రవరి 27 వరకు ఆ పదవిలో ఉన్న పారికర్‌ మళ్ళీ 2002 జూన్ 5న మరోసారి ముఖ్యమంత్రి అయ్యారు. 2012 శాసనసభ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ మెజారిటీ సాధించడంతో మరోసారి పారికర్ గోవా ముఖ్యమంత్రి అయ్యారు.

- Advertisement -