సంతన్న సవాల్‌ను స్వీకరించిన జీఎంఆర్ అధినేత..

229
gm rao
- Advertisement -

సోషల్ మీడియాలో మళ్లీ గ్రీన్‌ ఛాలెంజ్‌ ట్రెండ్‌ అవుతోంది. తాజాగా టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుడు సంతోష్‌ కుమార్‌ విసిరిన గ్రీన్‌ ఛాలెంజ్‌ను జీఎమ్మార్ అధినేత గ్రంధి మల్లికార్జున రావు స్వీకరించారు. గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా మల్లిఖార్జున రావు ఇవాళ తన నివాసంలో మొక్క నాటారు.

జీఎమ్మార్ సంస్థ తమ ప్రతీ ప్రాజెక్టులోనూ పచ్చదనం పెంపు కోసం ఇస్తున్న ప్రాధాన్యతను ఈ సందర్భంగా ఆయన గుర్తుచేసుకున్నారు. తెలంగాణకు హరితహారం తనకు ఇష్టమైన కార్యక్రమం అని, ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటి, సంరక్షించాలని ఈ సందర్భంగా మల్లికార్జున రావు ఆకాంక్షించారు.

gmr chairman

కాగా ‘హరా హైతో భరా హై’ (పచ్చగా ఉంటే ఇంపుగా ఉంటుంది) అంటూ గత ఏడాది మొదలైన గ్రీన్‌ ఛాలెంజ్‌ రెండు కోట్ల మొక్కలు నాటే దాకా చేరుకుంది. ఒకరు మొక్కనాటి మరో ముగ్గురు మొక్కలు నాటి, సంరక్షించేలా రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్‌ కుమార్‌ చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభమైన విషయం తెలిసిందే. గతంలో తాను స్వయంగా మొక్క నాటి, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, గవర్నర్‌ నరసింహన్, నటుడు నాగార్జునను నామినేట్‌ చేశారు. వారందరూ కూడా మొక్కలు నాటారు.

- Advertisement -