కొంతకాలం బ్రేక్…మాక్స్‌వెల్ సంచలనం

491
maxwell
- Advertisement -

ఆస్ట్రేలియా డాషింగ్ బ్యాట్స్‌మెన్ గ్లేన్ మాక్స్‌వెల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. కొంతకాలం క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. మంచి ఫామ్‌లో ఉన్న మాక్స్‌…క్రికెట్‌ నుంచి విరామం ప్రకటించడం అభిమానులకు నిరాశను గురిచేసింది.

మానసిక,ఆరోగ్య సమస్యల కారణంగానే మాక్స్‌వెల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు మాక్స్‌ వెల్ సైకాలజిస్ట్ మైఖెల్ తెలిపారు. మానసిక ఆరోగ్యానికి సంబంధించి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడని అందుకే క్రికెట్ కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడని ఆయన వెల్లడించారు. కొన్ని రోజులు రెస్ట్ తీసుకుని తిరిగి క్రికెట్ ఆడతానని మాక్స్ వెల్ సైతం వెల్లడించాడు.

ప్రస్తుతం ఆసీస్-శ్రీలంక మధ్య టీ20 సిరీస్‌ జరుగుతోంది. తొలి టీ20లో 28 బంతుల్లో 62 పరుగులు చేసిన మాక్స్‌…సడన్‌గా విరామం ప్రకటించడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.

- Advertisement -