జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని స్పూర్తిగా తీసుకొని హైదరాబాద్ లోని సన్ సిటి లో గల గ్లేండలే ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు ప్రకృతి క్లబ్ ను ఉపాధ్యాయుల సహకారంతో ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవ, ప్రతినిధి కిషోర్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. పాఠశాల సిబ్బంది, విద్యార్థులు ప్రకృతి క్లబ్ ను ప్రారంబించటానికి గల కారణం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ నుంచి పొందిన స్పూర్తినేనని వివరించారు.
ఈ సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవ మాట్లాడుతూ విద్యార్థులలో ప్రకృతి గురించి అవగాహన పెంచవలసిన అవసరం మనందరిపైన ఉందని ప్రకృతిని కాపాడితే మనందరం కూడా ఆరోగ్యంగా ఉంటామని తెలిపారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రారంభించిన 4 సంవత్సరాల కాలంలో ప్రకృతి పట్ల చాలా పెద్ద ఎత్తున అవగాహన తీసుకురావడం జరిగిందన్నారు. భవిష్యత్ తరాలకు ప్రకృతిని గురించి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రకృతి క్లబ్ ను ప్రారంభిస్తున్న గ్లేండలే ఇంటర్నేషనల్ స్కూల్ సిబ్బందికి, విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు. ఇదే విధంగా ప్రతి స్కూల్లో పకృతి క్లబ్బులు ఏర్పాటు చేసుకొవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ రాధిక, పాఠశాల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.