నాయకులు వస్తుంటారు…పోతుంటారు ప్రజలే విజ్ఞతతో ఆలోచించాలని పిలుపునిచ్చారు సీఎం కేసీఆర్. నర్సంపేటలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడిన కేసీఆర్..టీఆర్ఎస్ అభ్యర్థి పెద్ది సుదర్శన్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. నర్సంపేటలో గుండా రాజాకీయాలు చెల్లవని..రౌడీయిజం చేస్తే తాట తీస్తానని హెచ్చరించారు.
58 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్, టీడీపీలు ఓవైపు తెలంగాణ కోసం 14 ఏళ్లు తెలంగాణ కోసం పోరాడి,రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపు నడిపిస్తున్న టీఆర్ఎస్ ఓ వైపు ఉందన్నారు. ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్న టీఆర్ఎస్‌ని గెలిపించాలన్నారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా 24 గంటలు కరెంట్ ఇస్తున్నామని చెప్పారు. వృద్ధాప్య, వితంతు, వికలాంగుల, పెన్షన్లతో పాటు బీడీ కార్మీకులకు, బోధకాలు బాధితులకు పెన్షన్‌లిస్తున్నామని చెప్పారు. ఐక్యరాజ్యసమితి గుర్తించిన 10 పథకాల్లో రైతుబంధు ఒకటని ఇచ్చిన మాట ప్రకారం డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించి తీరుతామన్నారు.
కల్యాణ లక్ష్మీ పథకం వస్తుందని ఎవరూ ఊహించలేదని..గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి ప్రజల కళ్ల ముందే ఉందన్నారు. అధికారంలోకి వచ్చిన ఆరునెలల్లో బీడుభూముల సమస్యలను పరిష్కరిస్తామని..తండాలను గ్రామ పంచాయతీలుగా చేశామన్నారు. రానున్న ఎన్నికల్లో గిరిజన సోదరులు గ్రామా సర్పంచ్‌లు కానున్నారని చెప్పారు. నర్సంపేటలో కాంగ్రెస్ ఎమ్మెల్యే
గెలిచినా అభివృద్ధి ఆగలేదన్నారు. 2001 నుండి తెలంగాణ ఉద్యమంలో ఉన్న సుదర్శన్ రెడ్డిని గెలిపించాలన్నారు.