KCR:త్వరలో గిరిజన బంధు

50
- Advertisement -

బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ సాధన, తెలంగాణ ప్రజల కోసం అన్నారు సీఎం కేసీఆర్. సూర్యాపేట ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడిన సీఎం కేసీఆర్..జగదీశ్ రెడ్డి తన ఉద్యమ సహచరుడన్నారు. బీఆర్ఎస్ గెలిస్తే పెన్షన్ రూ. 5 వేలు పెరగనుందన్నారు. కళ్యాణ లక్ష్మీ, కేసీఆర్ లాంటి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయన్నారు. త్వరలో గిరిజన బంధు తీసుకురాబోతున్నామని చెప్పారు.

ఒకనాడు సూర్యాపేటలో ఎంత సాగు అయ్యేది…ఇప్పుడు ఎంత సాగు అవుతుందో ఆలోచించాలన్నారు. ఎటు చూసిన కాల్వలతో సూర్యాపేట కళకళలాడుతోందన్నారు. నీటి తీరువా రద్దు చేశామని…24 గంటల కరెంట్ ఇస్తున్నామని చెప్పారు. రైతు బంధు పుట్టించిందే కేసీఆర్ అన్నారు. రైతు బంధు దుబారా అని కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారని వారికి బుద్ది చెప్పాలన్నారు. భారీ మెజార్టీతో జగదీష్ రెడ్డి గెలిస్తేనే రైతు బంధు వస్తుందన్నారు.

సూర్యాపేటలో ఏడాదిలో 10 నెలలు కాల్వలు పారుతున్నాయన్నారు. కాంగ్రెస్ వస్తే ధరణిని తీసేస్తామని మాట్లాడుతున్నారని..ధరణితో రైతుల భూములకు రక్షణ కల్పించామని కానీ కాంగ్రెస్ తిరిగి దానిని దళారులకు ఇస్తుందని మాట్లాడుతుందన్నారు. ధరణి స్థానంలో కాంగ్రెస్ తీసుకువస్తున్న భూమాత కాదు భూమేత అన్నారు.50 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో రూ.200 పెన్షన్ ఇస్తే దానిని బీఆర్ఎస్ రూ.5 వేలకు తీసుకుపోయిదని ఎవరు కావాలో ఆలోచించాలని పిలుపునిచ్చారు. ఈ గడ్డమీద కాంగ్రెస్ నాయకులు అడ్డగోలు మాటలు మాట్లాడుతున్నారని వారికి బుద్దిచెప్పాలన్నారు. నల్గొండ జిల్లా చైతన్యం ఉన్న ప్రాంతం అని..భీంరెడ్డి నర్సింహారెడ్డి లాంటి మహానీయులు పుట్టిన ప్రాంతం అన్నారు.

10 ఏళ్లలో తెలంగాణలో అన్ని రంగాల్లో ప్రగతి సాధించామన్నారు. జగదీశ్వర్ రెడ్డి తనతో పాటు ఉద్యమకారుడన్నారు. ఏ ప్రలోభానికి లొంగకుండా తెలంగాణ ఉద్యమాన్ని నడిపితే తన వెంట నడిచిన వ్యక్తి అన్నారు. రైతులను అప్పుల పాలు చేసిన కాంగ్రెస్ కావాలా…రైతుల బాధలు తీరుస్తున్న బీఆర్ఎస్ కావాలో ఆలోచించాలన్నారు. బీజేపీకి ఓటేస్తే మోరిలో వేసినట్లేనన్నారు. ప్రతి మోటారుకు మీటర్ పెట్టాలని మోడీ తనపై ఒత్తిడి తెచ్చారని పెట్టనందుకు రూ.25 వేలు కోత విధించారన్నారు. దేశంలో అన్ని రాష్ట్రాలు మీటర్లు పెట్టాయని కేంద్రమంత్రి నిర్మలా సీతారామనే చెప్పారని కానీ తెలంగాణ పెట్టనందుకు కోత పెట్టామని మాట్లాడారని తెలిపారు. ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వని బీజేపీకి ఒక్క ఓటు ఎందుకు వేయాలో ఆలోచించాలన్నారు.

Also Read:Harishrao:కాంగ్రెస్‌వి మోసపూరిత మాటలు

- Advertisement -