మహిళలు సాధారణ స్థితిలో కంటే గర్భం దాల్చినప్పుడు ఆరోగ్యంపై మరింత శ్రద్ద వహించాల్సి ఉంటుంది. తినే ఆహారం విషయంలోనూ, వివిధ అలవాట్ల విషయంలోనూ ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎందుకంటే గర్భిణీలు అనారోగ్యం పాలైతే ఆ ప్రభావం పుట్టబోయే శిశువుపై కూడా పడుతుంది. పైగా గర్భం దాల్చినప్పుడు అనారోగ్య సమస్యలు చాలా ఎక్కువే. కాబట్టి అన్నీ విధాలుగా జాగ్రత్తలు తప్పనిసరి. కాబట్టి గర్భిణీలలో వచ్చే కొన్ని సాధారణ సమస్యలను ఎదుర్కొనేందుకు ఇంటి చిట్కాలు బాగా పని చేస్తాయి అవేంటో తెలుసుకుందాం.!
సాధారణంగా గర్భిణీ స్త్రీలకు వాంతులు, అజీర్తి, ఉబ్బరం వంటి సమస్యలు తరచూ వేధిస్తుంటాయి. వీటి నుంచి బయటపడటానికి అల్లంపాలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఒక గ్లాస్ నీటిలో అల్లం ముక్క వేసి బాగా మరిగించిన తరువాత ఆ నీటిని అలంపాలుగా గరిగణిస్తారు ఆయుర్వేద నిపుణులు. ఈ నీటిని తాగడం వల్ల గర్భిణిలకు వచ్చే ఉదర సంబంధిత సమస్యలన్నీ దూరమవుతాయి. ఇక గర్భిణీ స్త్రీలు తరచూ అనారోగ్యం పాలవుతున్నారు. అలాంటప్పుడు ఇమ్యూనిటీని పెంచుకునేందుకు వేడినీటిలో నిమ్మరసం కలిపి తాగాలి. .
ఇలా చేయడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది. ఇంకా చికెన్ సూప్ తాగడం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే చికెన్ లో ప్రోటీన్ శాతం అధికంగా ఉంటుంది. కాబట్టి చికెన్ సూప్ తాగడం వల్ల కండరాలు బలం పొందుతాయి. ఇక ప్రతి రోజూ క్రమం తప్పకుండా పాలు తాగడం అలవాటు చేసుకోవాలి. పాలు తాగడం వల్ల కడుపులోని శిశువు ఆరోగ్యంగా, బలంగా ఉండేందుకు వీలుంటుంది. ఇంకా పండ్ల రసాలు, కూరగాయలతో చేసిన జ్యూస్ ఇవన్నీ కూడా గర్భిణిలకు శక్తినిచ్చేవే. కాబట్టి ఈ పానీయాలను క్రమం తప్పకుండా గర్భిణీలు తాగడం అలవాటు చేసుకోవాలి.
Also Read:Kavitha:మోడీ పెద్దన్న ఎలా అవుతాడు?