- Advertisement -
గిఫ్ట్ ఏ స్మైల్‌లో భాగంగా పదో తరగతి విద్యార్థులకు సాయం చేయనున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ . సిరిసిల్ల నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న టెన్త్ విద్యార్థులకు పరీక్షలు రాయడానికి ప్యాడ్లు, పెన్నులు పంపిణీ చేయనున్నారు.
ఇవాళ సిరిసిల్ల పట్టణం, తంగళ్లపల్లి, ఎల్లారెడ్డి పేట, వీర్ణపల్లి, గంభిరావుపేట, మూస్తాబాద్‌లోని ప్రభుత్వ జడ్‌పీహెచ్‌ఎస్‌లలో చదువుతున్న పదో తరగతి విద్యార్థులకు అందివ్వనున్నారు.
ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేశారు బీఆర్ఎస్ నేతలు. పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని మాజీ మంత్రి కేటీఆర్ ఆకాంక్షించారని, పరీక్ష రాయబోతున్న పదో తరగతి విద్యార్థులకు శుభా కాంక్షలు తెలిపినట్లు పార్టీ నేతలు తెలిపారు.
Also Read:కిషన్ రెడ్డి దుష్ప్రచారం తగదు: ఎంపీ చామల
- Advertisement -

