జీహెచ్‌ఎంసీ కార్మికులకు దసరా కానుక

213
GHMC sanitary workers Salaries hiked
GHMC sanitary workers Salaries hiked
- Advertisement -

దసరా కానుకగా జీహెచ్‌ఎంసీ కార్మికుల జీతాలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. కార్మికుల వేతనాలు రూ. 12,500 నుంచి రూ. 14 వేలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వేతనాల పెంపు ద్వారా 22,394 మంది కార్మికులకు లబ్ది చేకూరనుంది. తెలంగాణ వచ్చే నాటికి రూ.8,500లు ఉన్న పారిశుధ్య కార్మికుల వేతనాన్ని సీఎం కేసీఆర్ గతంలోనే రూ.12,500 లకు పెంచారు. ఇప్పుడు మరోసారి రూ.1500 పెంచి, మొత్తం జీతాన్ని రూ.14,000 చేశారు.

నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి పారిశుధ్య కార్మికులు పడుతున్న శ్రమను గుర్తించిన ముఖ్యమంత్రి.. గతంలో జీతం పెంచినప్పుడు మరోసారి వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చారు.వేతనాలు పెంచి మాట నిలబెట్టుకున్నారు సీఎం కేసీఆర్.  వేతనాల పెంపుపై నగర మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియూద్ధీన్ హర్షం వ్యక్తం చేశారు.

- Advertisement -