కూకట్‌పల్లి రాజీవ్‌గాంధీ ఫ్లైఓవర్ నాణ్యతపై సామాజిక మాద్యమాల్లో వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని జిహెచ్ఎంసి ప్రాజెక్ట్ విభాగం ఇంజనీర్లు స్పష్టం చేశారు. ఏడాది కాకముందే నాణ్యత లోపం అని కూకట్‌పల్లి రాజీవ్‌గాంధీ ఫ్లైఓవర్‌పై ట్విట్టర్ వేదికగా పలువురు ఫిర్యాదు చేశారు. దీంతో జిహెచ్ఎంసి ఇ.పి.సి, పి.ఎం.సి విభాగాలతో పాటు వెస్ట్ జోన్ ప్రాజెక్ట్ డివిజన్ ఇంజనీర్లు ఫోరం మాల్ ఎదురుగా ఉన్న ఫ్లైఓవర్‌ను తనిఖీ చేశారు.
ఫ్లైఓవర్ స్లాబ్‌కు సంబంధించిన స్ట్రక్చర్‌కు ఏవిధమైన సమస్యలు లేవని, అయితే జాయింట్‌లను కలపడానికి అధికమొత్తంలో సిమెంట్ మిశ్రమాన్ని ఉపయోగించినందున స్వల్పంగా పెచ్చులుడాయని తెలిపారు. ఆ ప్రాంతంలో స్మూత్ ఫినిషింగ్ చేశామని తెలిపారు.అయితే ఫ్లైఓవర్ నిర్మాణ స్థిరత్వానికి ఏవిధమైన సమస్యలేదని జిహెచ్ంఎసి ఇంజనీర్లు ఓ ప్రకటనలో స్పష్టం చేశారు.