GHMC:మీడియా స్వేచ్ఛకు భంగం కల్పించం

6
- Advertisement -

మీడియా ముసుగులో కొంత మంది బోగస్ విలేకరులు జిహెచ్ఎంసి అధికారులను, భవన నిర్మాతలను, సాధారణ ప్రజలను,పేదలను తీవ్రస్థాయిలో వేధింపులు గురి చేయడంతో పాటు బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు దండుకుంటున్న బోగస్ నకిలీ రిపోర్టర్ల బెడద నుంచి కాపాడాలని, జీహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ లో అన్ని పార్టీల సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేశారు.

స్టాండింగ్ కమిటీ సభ్యులు లేవనెత్తిన నకిలీ విలేకరుల సమస్య నగరం మొత్తం తీవ్రంగా ఉంది. రోజూ ఈ అంశంపై అనేక ఫిర్యాదులు ప్రజా ప్రతినిధులకు వస్తున్నాయి. నకిలీ విలేకరులు జీ హెచ్ ఎం సి జోనల్.. సర్కిల్ కార్యాలయాల్లో తిష్టవేస్తూ అధికారులను సైతం అనేక రకాలుగా వేధిస్తున్నారని అన్ని సర్కిల్ల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి.

ఈ మేరకు స్టాండింగ్ కమిటీ సభ్యుల డిమాండ్ మేరకు త్వరలో బోగస్ విలేకరులను ఆయా సర్కిల్ కార్యాలయాల్లో.. ప్రధాన కార్యాలయాల్లో రాకుండా చూడాలి అని సభ్యులు తీర్మానం చేయాలని కోరారు.అయితే అలాంటి నియంత్రణలు ఎలాంటి ప్రభుత్వ గుర్తింపులు లేకుండా అరాచకాల సృష్టిస్తున్న బోగస్ మీడియాకు మాత్రమే వర్తిస్తుంది.గుర్తింపు పొందిన మీడియా సంస్థలకు, గుర్తింపు పొందిన మీడియా ప్రతినిధులకు అడ్డంకులు కల్పించాలన్నది జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ ఉద్దేశం కాదు.

పారదర్శక విధానాలను పాటించడమే జిహెచ్ఎంసి లక్ష్యం.బోగస్ నకిలీ విలేకరుల బెడదను కొంతైనా తగ్గించే ప్రయత్నంలో భాగంగా జీ హెచ్ ఎం సి స్టాండింగ్ కమిటీతీసుకునే చర్యలకు గుర్తింపు పొందిన మీడియా సంస్థలు, నిజమైన విలేకరులు మద్దతు పలుకుతారని ఆశిస్తున్నాము.ఈ వ్యవహారంలో గుర్తింపు పొందిన మీడియా సంస్థలు, ప్రతినిధులు ఎలాంటి ఆపోహాలకు గురికావద్దని కోరుతున్నాము.

మీడియా స్వేచ్ఛకు భంగం కలిగించే ఎలాంటి చర్యలకు జిహెచ్ఎంసి పాల్పడబోదు.అయితే అధికారుల విధులకు భంగం కలగకుండా ఉండేందుకు,. నిర్ణీత సమయం లో మాత్రమే కలుసుకునే విధంగా PRO వ్యవస్థను సర్కిల్/ జోనల్ కార్యాలయాల్లో కూడా బలపరచి, వారి ద్వారా సమాచారం ఇవ్వాలనేది స్టాండింగ్ కమిటీ సభ్యుల ఉద్దేశ్యం అన్నారు.

Also Read:‘సీతా పయనం’..సాంగ్ రిలీజ్

- Advertisement -