బల్దియా ఏనిమల్ వెల్ఫేర్ కేంద్రాలలో విజిలెన్స్ తనికీలు..

109
GHMC

గ్రేటర్ హైదరాబాద్‌లో జీహెచ్ఎంసీ ఆద్వర్యంలో నిర్వహిస్తున్న ఐదు ఎనిమల్ వెల్ఫేర్ సెంటర్లను జీహెచ్ఎంసీ విజిలెన్స్, ఎంఫోర్సుమెంట్ విభాగం అధికారులు నేడు ఏకకాలంలో తనికీలు నిర్వహించారు. గ్రేటర్‌ పరిధిలోని కూకట్పల్లి, అంబర్ పేట, జీడిమెట్ల, ఎలిబీ నగర్, చుడీ బజార్‌లలో ఈ ఎనిమల్ వెల్ఫేర్ సెంటర్లను జీహెచ్ ఎంసీ వెటర్నరీ విభాగం నిర్వహిస్తోంది.

ఇటీవల కాలంలో నగరంలో వీధి కుక్కల బెడద అధికమైందంటూ పత్రికల్లో వరుస కథనాలు రావడంతో అసలు వెటర్నరీ విభాగం ద్వారా నిర్వహించే ఎనిమల్ వెల్ఫేర్ కేంద్రాల నిర్వహణా పనితీరుపై తనికీలు నిర్వహించాలని విజిలెన్స్ విభాగాన్ని కమీషనర్ దాన కిషోర్ ఆదేశించారు.

ఈ నేపథ్యంలో నేడు విజిలెన్స్ కు చెందిన ఐదు బృందాలు ఈ ఎనిమల్ వెల్ఫేర్ కేంద్రాల్లో తనికీలు నిర్వహించాయి. ఈ కేంద్రాల్లో వీధి కుక్కలకు నిర్వహిస్తున్న ఆపరేషన్లు, షెల్టర్ల నిర్వహణ, మెడిసిన్స్ లను నిల్వ చేసే ఏ.సిల నిర్వహణ, ఆపరేషన్ల అనంతరం వీధి కుక్కలను ఉంచే బోన్‌ల సైజ్, కేంద్రాల్లో పరిశుభ్రత, శునకాలు అందిందించే ఆహార నాణ్యత తదితర అంశాలపై తనికీలు నిర్వహించినట్లు జీహెచ్ ఎంసీ ఎంఫోర్సుమెంట్, విజిలెన్స్ డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి వెల్లడించారు. తమ బృందాలు నిర్వహించిన తనికీల్లో వెల్లడైన అంశాలపై నివేదికను కమీషనర్‌కు సమర్పించడం జరుగుతుందని కంపాటి అన్నారు.