ముగిసిన గ్రేటర్ ఎన్నికల ప్రచార పర్వం..

227
Election Campaign End
- Advertisement -

నేటితో జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారం ముగిసింది. గ్రేటర్‌ ఎన్నికలను పలు పార్టీలు ఈ సారి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం, కాంగ్రెస్ మధ్య చతుర్ముఖ పోరు నెలకొంది. పోటా పోటీగా ప్రచారాలు, రెచ్చగొట్టే ప్రసంగాలు, వివాదాస్పద వ్యాఖ్యలతో.. గ్రేటర్‌లో వాతావరణాన్ని నేతలు వేడెక్కించారు. హైదరాబాద్ పరిధిలో సాయంత్రం 6 గంటల తర్వాత మైకులు మూగబోయాయి. గడువు ముగిసిన తర్వాత ఎవరైనా ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్నికల సంఘం ఇది వరకే హెచ్చరించింది.

కాగా, జీహెచ్ఎంసీ పరిధిలోని 150 డివిజన్లకు.. డిసెంబరు 1న పోలింగ్ జరగనుంది. ఇప్పటికే ఎన్నికల అధికారులు ఆయా ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు. అవసరమైన చోట డిసెంబరు 3న రిపోలింగ్ నిర్వహిస్తారు. ఇక డిసెంబరు 4న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడిస్తారు. కరోనా నేపథ్యంలో ఈసారి ఈవీఎంకు బదులు బ్యాలెట్ పద్దతిలోనే పోలింగ్ నిర్వహిస్తున్నారు.

- Advertisement -