హయత్ నగర్‌లో జీహెచ్‌ఎంసీ కూల్చివేతలు చేపట్టింది. అన్ని అనుమతులు ఉన్నా కూడా లంచం ఇవ్వలేదని ఇల్లును కూల్చేసింది GHMC సిబ్బంది. హయత్ నగర్ లోని లక్ష్మీప్రియ కాలనీలో ఫ్లాట్ కొని, G+2 కట్టుకోవడానికి అన్ని అనుమతులను తీసుకున్నారు ఉమా మహేశ్వర రెడ్డి.
అయినా డబ్బులు ఇస్తేనే ఇల్లు కట్టుకోనిస్తానని వేధించారు ఎల్బీ నగర్ సర్కిల్-3 పట్టణ ప్రణాళిక శాఖ చైర్మన్ సతీష్ కుమార్. తానూ సామాన్య మధ్య తరగతి వ్యక్తిని అని కొంత మొత్తంలో డబ్బులు ఇవ్వగలనని ఇల్లు కట్టుకోవడానికి అడ్డుపడొద్దని వేడుకున్నారు ఉమా మహేశ్వర రెడ్డి.
అడిగినన్ని డబ్బులు ఇవ్వడం లేదని టెంపరరీగా వేసుకున్న ఇల్లును తన మనుషులతో కలిసి కూల్చేశారు సతీష్ కుమార్. తన దగ్గర అన్ని ఆధారాలున్నాయని ప్రభుత్వ పెద్దలు, ప్రతిపక్ష నాయకులు తనకు న్యాయం చేయాలని వేడుకున్నారు ఉమా మహేశ్వర రెడ్డి.
Also Read:రైతు భీమా పథకం నిర్వీర్యమేనా?:హరీష్

