ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు…

201
parthasarathi
- Advertisement -

హైదరాబాద్ గ్లోబల్ సిటీ ఇక్కడ నివసించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారని తెలిపారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారధి. జీహెచ్‌ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల సందర్భంగా మాట్లాడిన ఆయన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు ఎంతో ప్రాధాన్యం ఉందన్నారు.

కొవిడ్‌ నిబంధనల మేరకు ఎన్నికలు నిర్వహిస్తున్నామని… ఈ సారి ఎన్నికల్లో వార్డుల విభజన లేదని, 2016లో మాదిరిగానే 150 వార్డులకు, అవే రిజర్వేషన్లతో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.150 వార్డుల్లో కౌంటింగ్‌ కేంద్రాలు, స్ట్రాంగ్‌ రూమ్స్‌ ఉంటాయని చెప్పారు. ఎన్నికలు బ్యాలెట్‌ పద్ధతిలోనే నిర్వహిస్తున్నామని, ఈవీఎంలపై అభ్యంతరాలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

నేటి నుండే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని తెలిపిన పార్థసారధి…ఎన్నికల్లో పోటీ చేసే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు రూ.2500, ఇతరులు రూ.5వేలు డిపాజిట్‌ చెల్లించాల్సి ఉంటుందన్నారు. అభ్యర్థుల ఖర్చు పరిమితి రూ. 5 లక్షలని తెలిపారు. ఎన్నికల పర్యవేక్షణ కోసం ఒక్కో జోన్‌కు ఐఎస్‌ఐ అధికారి చొప్పున ఆరుగురిని నియమించినట్లు చెప్పారు.

కరోనా నేపథ్యంలో పోలింగ్‌ కేంద్రాల్లో వన్‌ ప్లన్‌ 3 చొప్పున సిబ్బంది ఉంటారన్నారు. ఎన్నికలకు 48వేల సిబ్బంది సిబ్బందిని వినియోగిస్తున్నట్లు చెప్పారు. గ్రేటర్‌లో 257 క్రిటికల్‌, 1439 సమస్యాత్మక, 1004 అత్యంత సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను గుర్తించినట్లు చెప్పారు. ఎన్నికల్లో కోడ్‌ను ఉల్లంఘిస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.

ప్రతి పోలింగ్‌ స్టేషన్‌కు ఇద్దరు పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తారని, ఇందుకు 20నుంచి30వేల మంది సిబ్బందిని ఎన్నికలకు వినియోగించనున్నట్లు తెలిపారు. ఎన్నికల నిర్వహణ కోసం అక్కడక్కడా చెక్‌పోస్టులను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.

- Advertisement -