లైంగిక వేధింపుల కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న గజల్ శ్రీనివాస్‌కు నాంపల్లి న్యాయస్థానం నేడు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ.10వేల నగదు పూచీకత్తు ఇవ్వాలని, ప్రతి బుధ, ఆదివారాల్లో పంజాగుట్ట ఇన్‌స్పెక్టర్ ముందు హాజరుకావాలని ఆదేశించింది.
ఇక ఇదే కేసులో గజల్ శ్రీనివాస్ సహాయకురాలు, ఏ-2 నిందితురాలిగా ఉన్న పార్వతికి కూడా కోర్టులో ఊరట లభించింది. పార్వతికి కూడా ముందస్తు బెయిల్ మంజూరైంది. మహిళను లైంగికంగా వేధించిన కేసులో గజల్ శ్రీనివాస్‌ను పంజాగుట్ట పోలీసులు ఈ నెల 2న అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
మెట్రోపాలిటన్ న్యాయస్థానంలో బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్ తిరస్కరణకు గురవ్వడంతో ఈ నెల 12న నాంపల్లి సెషన్స్ కోర్టులో గజల్ తరపు న్యాయవాది బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. మంగళవారం బెయిల్ పిటిషన్‌పై ఇరువర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి నేడు నిందితులిద్దరికి బెయిల్ మంజూరు చేశారు.