‘ఘటన’ మూవీ రివ్యూ

293
Ghatana movie review
- Advertisement -

‘దృశ్యం’ వంటి సూపర్‌హిట్‌ చిత్రం తర్వాత శ్రీప్రియ దర్శకత్వంలో వస్తోన్న మరో అద్భుత దృశ్యకావ్యం ‘ఘటన’. నిత్యామీనన్‌ ప్రధాన పాత్రలో క్రిష్‌ జె. సత్తార్‌ హీరోగా మలయాళంలో సూపర్‌హిట్‌ అయిన ’22 ఫిమే ల్‌ కొట్టాయం’ చిత్రాన్ని సన్‌మూన్‌ క్రియేషన్స్‌ పతాకంపై తెలుగులో రీమేక్‌ చేసి తెరకెక్కించారు. మరి ఘటనతో నిత్యామీనన్ ప్రేక్షకులను ఆకట్టుకుందా..?శ్రీప్రియ మరోసారి హిట్ కొట్టిందా లేదా చూద్దాం…

క‌థః

మాలిని(నిత్యామీన‌న్‌) ఓ ప్రైవేట్ హాస్పిట‌ల్‌లో నర్సుగా ప‌ని చేస్తుంటుంది. కెన‌డా వెళ్లి ప‌నిచేయాల‌నే బ‌ల‌మైన కోరిక‌తో ఉన్న మాలిని వీసా కోసం ఓ క‌న్స‌ల్‌టెన్సీని సంప్ర‌దిస్తుంది, ఆ క‌న్స‌ల్‌టెన్సీ య‌జ‌మాని ప్ర‌కాష్‌(న‌రేష్‌).అదే కన్సల్‌టెన్సీలో పనిచేసే వ‌రుణ్‌(క్రిష్ జె.స‌త్తార్‌) తో మాలినితో పరిచయం ఏర్పడుతుంది. వ‌రుణ్ చేసిన సాయం వల్ల మాలిని వీసా వస్తుంది. ఈ క్రమంలో వీరిద్దరు ప్రేమలో పడతారు. అయితే…అనుకోకుండా వరుణ్ ఓ ప్రమాదంలో ఇరుక్కుంటాడు…తర్వాత ఏం జరుగుతుంది..?వరుణ్‌తో మాలిని కష్టాల్లో పడిందా అన్నదే మిగితా కథ.

Ghatana movie review

ప్లస్ పాయింట్స్‌:

నిత్యామీన‌న్ మరోసారి తన నటనతో ఆకట్టుకుంది. తనదైన శైలీలో నటించి పాత్రకు ప్రాణం పోసింది. క్రిష్ జె సత్తార్ న‌ట‌న కూడా అంద‌రినీ మెప్పిస్తుంది. న‌రేష్ కీల‌క పాత్ర‌లో న‌టించి త‌న పాత్ర‌కు న్యాయం చేశారు. కోవైస‌ర‌ళ‌, విద్యుల్లేఖా రామ‌న్, కోట‌శ్రీనివాస‌రావు త‌దిత‌రులు వారి వారి పాత్ర‌ల‌కు న్యాయం చేశారు.

మైనస్ పాయింట్స్‌:

ఫ‌స్టాఫ్‌లోని ముప్పై నిమిషాలు బోరింగ్‌గా అనిపిస్తాయి. క‌థ‌, దాని చుట్టూ అల్లుకున్న స‌న్నివేశాలు బ‌లంగా అనిపించ‌వు.మెయిన్ పాయింట్‌ను ద‌ర్శ‌కురాలు శ్రీప్రియ ఆస‌క్తిక‌రంగా మ‌ల‌చ‌లేక‌పోయారు. సెకండాఫ్ క‌థంతా రివేంజ్ డ్రామాగా సాగుతుంది.

సాంకేతిక విభాగం:

ఎప్పుడో నిర్భ‌య ఘ‌ట‌న జ‌రిగిన‌ప్పుడు రావాల్సిన ఈ సినిమా ఇప్పుడు రావ‌డంతో కాన్సెప్ట్ ప‌రంగా సినిమా పాత‌బ‌డిన‌ట్టు అనిపిస్తుంది. ఇలాంటి కాన్సెప్ట్ మూవీలు చాలానే వ‌చ్చేశాయి క‌దా అనిపిస్తుంది. అర‌వింద్ శంక‌ర్ సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఓకే అనిపిస్తాయి. మ‌నోజ్ పిళ్లై సినిమాటోగ్ర‌ఫీ కూడా గొప్ప‌గా లేదు. అనంత్ శ్రీరాం సాహిత్యం, బ‌వ‌న్ శ్రీకుమార్ ఎడిటింగ్ స‌హా టెక్నిక‌ల్ టీం కూడా ఏదో చేశామంటే చేశామ‌నేలా సినిమాను రూపొందించారా అనిపిస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

Ghatana movie review+

తీర్పు:

ఆడ‌వాళ్ల‌పై జ‌రిగే అత్యాచారాలు ప‌త్రిక‌ల్లో చూస్తూనే ఉంటాం. ఇలా ఎందుకు జ‌రుగుతుంది. ప్ర‌భుత్వాలు ఏం చేయాలేవా అని స‌గ‌టు పౌరుడి ఆలోచన విధానాన్ని నేప‌థ్యంగా చేసుకుని ద‌ర్శ‌కురాలు శ్రీప్రియ తెర‌కెక్కించిన చిత్ర‌మే `ఘ‌ట‌న‌`. నిత్యామీనన్ నటన సినిమాకు ప్లస్ పాయింట్ కాగా…కథ,కాన్సెప్ట్ సినిమాకు మైనస్ పాయింట్స్. మొత్తంగా సగటు ప్రేక్ష‌కుడు ఎక్క‌డా ఎమోష‌న‌ల్‌గా క‌థ‌కు క‌నెక్ట్ కాడు.

విడుదల తేదీ:18/11/2016
రేటింగ్:2.5/5
నటీనటులు:నిత్యామీన‌న్‌, క్రిష్ జె.స‌త్తార్‌
సంగీతం: అరవింద్‌ శంకర్‌
నిర్మాత: వి.ఆర్‌. కృష్ణ ఎం
దర్శకత్వం: శ్రీప్రియ

- Advertisement -