- Advertisement -
కిరణ్ కొర్పాటి దర్శకత్వంలో మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన చిత్రం ‘గని’. అల్లు బాబీ, సిద్ధు ముద్ద నిర్మించిన ఈ మూవీతో హీరోయిన్ గా సాయీ మంజ్రేకర్ తెలుగువారికి పరిచయం అయ్యారు. ఉపేంద్ర, జగపతిబాబు, సునీల్ శెట్టి, నదియా, నవీన్ చంద్ర తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా కోసం దాదాపు మూడేళ్ళు వరుణ్ తేజ్ కష్టపడ్డాడు.
అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఈ విషయాన్ని వరుణ్ తేజ్ కూడా అంగీకరించగా తాజాగా సినిమా ఓటిటి విడుదల తేదీ ఫిక్స్ అయ్యింది. ఏప్రిల్ 22న ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో ప్లాప్ టాక్ ను అందుకున్న “గని”కి ఓటిటిలో ఎలాంటి స్పందన వస్తుందో వేచి చూడాలి.
- Advertisement -