రివ్యూ: గని

130
ghani
- Advertisement -

మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గని’. అల్లు బాబీ – సిద్ధు ముద్ద నిర్మించిన ఈ చిత్రంతో సయీ మంజ్రేకర్ టాలీవుడ్‌కు హీరోయిన్‌గా పరిచయం అవుతుంది. బాక్సింగ్ నేపథ్యంతో తెరకెక్కిన ఈ చిత్రంతో వరుణ్ తేజ్ ఆకట్టుకున్నాడా…?దర్శకుడిగా కిరణ్ కొర్రపాటి హిట్ కొట్టాడా లేదా చూద్దాం..

కథ:

ఘని (వరుణ్ తేజ్) ఒక బాక్సర్ కొడుకు. అతని తండ్రి బాక్సింగ్ చేస్తున్నప్పుడు డ్రగ్స్ ఉపయోగించి పట్టుబడటంతో మోసగాడిగా ముద్రపడుతుంది. బాక్సింగ్ టోర్నమెంట్‌ను గెలవాలనే తన తండ్రి కలను ఎలా నెరవేరుస్తాడు..? వరుణ్‌ని బాక్సింగ్‌ చేయకుండా అడ్డుకుంది ఎవరు..?చివరు లక్ష్యాన్ని ఘని చేరుకున్నాడా లేదా అన్నదే కథ.

ప్లస్ పాయింట్స్‌:

సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్స్ టైటిల్ సాంగ్, క్లైమాక్స్ ,ప్రొడక్షన్ వాల్యూస్. తన నటనతో మెప్పించాడు వరుణ్. బాక్సింగ్ కోసం వరుణ్ శిక్షణ తీసుకోగా కథకు తగ్గట్టుగా సెట్ అయ్యాడు వరుణ్. తెరంగేట్రం చేసిన సాయి మజ్రేకర్…మెప్పించింది. నదియా, ఉపేంద్ర, సునీల్ శెట్టి నటన బాగుండగా జగపతి బాబుకి మరో మంచి పాత్ర లభించింది. చివరగా, నవీన్ చంద్ర తన నటనతో మెప్పించగా మిగితా నటీనటులు పర్వాలేదనిపించారు.

మైనస్ పాయింట్స్‌:

సినిమాలో మేజర్ మైనస్ పాయింట్స్ రొటీన్ స్టోరీ, పేలవమైన డైలాగ్స్‌,ఊహాజనితమైన కథనం.

సాంకేతిక విభాగం:

సాంకేతికంగా సినిమా సూపర్బ్. తమన్ సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. జార్జ్ సి విల్లయిమ్స్ సినిమాటోగ్రఫీ,, మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమాను మరో స్ధాయికి తీసుకెళ్లాయి.

తీర్పు:

కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వరుణ్ తేజ్ బాక్సర్‌గా నటించిన చిత్రం గని. వరుణ్ నటన, నిర్మాణ విలువలు,క్లైమాక్స్ సినిమాకు ప్లస్ కాగా రోటిన్ కథ మైనస్ పాయింట్స్. ఓవరాల్‌గా ఈ వీకెండ్‌లో పర్వాలేదనిపించే మూవీ గని.

విడుదల తేదీ:08/04/2022
రేటింగ్:2.5/5
నటీనటులు: వరుణ్ తేజ్,సయి మంజ్రేకర్
సంగీతం:తమన్
నిర్మాత:అల్లు బాబీ
దర్శకత్వం: కిరణ్ కొర్రపాటి

- Advertisement -