జార్జిరెడ్డి నిర్మాతలతో సొహైల్‌!

40
sohail

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విజయవంతంగా ముగిసిన సంగతి తెలిసిందే. విన్నర్‌గా అభిజిత్ నిలవగా మూడో స్ధానంలో నిలిచారు సొహైల్. ఇక సొహైల్ రూ. 25 లక్షల ప్రైజ్‌మనీతో బయటకు రాగా మెగాస్టార్ చిరంజీవి,కమెడియన్ బ్రహ్మానందం …సోహెల్‌ తీయబోయే సినిమాలో నటిస్తామని మాట ఇచ్చిన సంగతి తెలిసిందే.

సొహైల్ త‌న డెబ్యూ చిత్రాన్ని ప్ర‌క‌టించాడు. జార్జిరెడ్డి, ప్రెష‌ర్ కుక్క‌ర్ నిర్మాత‌లు అప్పిరెడ్డితో క‌లిసి సినిమా చేయ‌నుండగా, ఈ చిత్రాన్ని శ్రీనివాస్ వింజనంపతి తెర‌కెక్కించనున్నారు. త్వ‌ర‌లోనే ఈ చిత్ర టైటిల్‌తో పాటు క్రూ అండ్ క్యాస్ట్ ప్ర‌క‌టించ‌నున్నారు.