తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు నిబంధనలు అతిక్రమిస్తూ క్లాసెస్ నిర్వహిస్తున్న కార్పొరేట్ కళాశాలలపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఇంటర్మీడియట్ బోర్డ్ సెక్రటరీకి వినతి పత్రం అందజేశారు బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్.
ఈ సందర్భంగా గెల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కార్పొరేట్ కళాశాలలకు కొమ్ము కాస్తూ పేద వర్గాల విద్యార్థులకు ఇంటర్ విద్యను దూరం చేస్తోంది అన్నారు. రాష్ట్రంలో ఉన్న ఇంటర్ కాలేజీలను నిర్వీర్యం చేస్తూ ఉత్తరాది కళాశాలలకు తొత్తుగా వ్యవహరిస్తున్నది కాంగ్రెస్ సర్కార్.. వేసవిలో క్లాసులు నిర్వహిస్తూ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయి కార్పొరేట్ కళాశాలు అన్నారు.
ఇంజనీరింగ్ కోర్స్ ఫీజ్ ను మించి ఇంటర్ విద్యకు లక్షలకు లక్షల రూపాయలు ఫీజుల పేరిట గుంజుతూ విద్యార్థుల రక్తం తాగుతున్నది కార్పొరేట్ మాఫియా.. ప్రభుత్వం వెంటనే కార్పొరేట్ కళాశాలల దోపిడిని ఆరికట్టి కళాశాలపై చర్యలు తీసుకోవాల్సిందిగా బీఆర్ఎస్వి పక్షాన డిమాండ్ చేస్తున్నాం అన్నారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వి రాష్ట్ర ఉపాధ్యక్షులు తుంగ బాలు, కడారి స్వామి యాదవ్, పాండు గౌడ్, జంగయ్య, చటారి దశరథ్, కాటం శివ, అశ్వంత్ కుమార్, రాజ్ కుమార్, విశాల్, శ్రీకాంత్ ముదిరాజ్, నాగేందర్ రావు, రాహుల్, రెహమత్, ప్రశాంత్, కిరణ్, సంపత్, సాయి, ఆఫ్రిద్ తదితర విద్యార్థి నాయకులు పాల్గొన్నారు.
Also Read:ప్రభుత్వ బెదిరింపులకు భయపడం:ఆర్టీసీ కార్మికులు

