హుజూర్‌నగర్‌ మున్సిపల్ ఛైర్మన్‌గా గెల్లి అర్చన రవి..

309
archana

కాంగ్రెస్ కంచుకోటను బద్దలు కొడుతూ హుజూర్‌నగర్‌ లో టీఆర్ఎస్ భారీ విజయాన్ని నమోదుచేసిన సంగతి తెలిసిందే. మెజార్టీ వార్డుల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్ధులు గెలుపొందడంతో ఛైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకుంది గులాబీ పార్టీ.

మున్సిపల్ చైర్మన్ గా 26వ వార్డు నుండి గెలుపొందిన గెల్లి అర్చన రవి ఎన్నికవ్వగా వైస్ చైర్మన్ గా 17వ వార్డు నుంచి గెలుపొందిన జక్కుల నాగేశ్వరరావు ఎన్నికయ్యారు.

హుజూర్‌నగర్‌ లో మొత్తం 28వార్డులకు గాను టీఆర్ఎస్‌ 20 వార్డుల్లో గెలుపోందగా, కాంగ్రెస్ 7, సీపీఎం 1వార్డులో విజయకేతనం ఎగురవేసింది. 26వ వార్డు నుండి అర్చన రవి సూర్యపేట జిల్లాలోనే అత్యధిక మెజార్టీతో (742) గెలుపొందగా ఆమెనే ఛైర్మన్ పదవి వరించింది.