Anjali:గీతాంజలి మళ్లీ వచ్చింది

24
- Advertisement -

హార‌ర్ కామెడీ జోన‌ర్‌లో అంజ‌లి ప్ర‌ధాన పాత్ర‌ధారిగా న‌టించిన బ్లాక్‌బ‌స్ట‌ర్ `గీతాంజ‌లి`ను అంత తేలిగ్గా ఎవ‌రూ మ‌ర్చిపోలేరు. తెలుగు చిత్ర పరిశ్రమలో హారర్ కామెడీ జోనర్‌లో గీతాంజ‌లి మూవీ ఓ ట్రెండ్ సెట్ చేసింది. ప్రతీకార జ్వాల‌తో మ‌ళ్లీ వ‌చ్చేస్తోంది గీతాంజ‌లి అంటూ గీతాంజ‌లి సీక్వెల్‌ను స్టార్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. ‘గీతాంజ‌లి మ‌ళ్లీ వ‌చ్చింది’ అనే పేరుతో సీక్వెల్‌ను తెర‌కెక్కిస్తున్నారు. ప్రముఖ రైటర్, ప్రొడ్యూసర్ కోన వెంకట్ సమర్పణలో ఈ సీక్వెల్‌ను ఎంవీవీ సినిమా, కోన ఫిల్మ్ కార్పొరేష‌న్‌ సంస్థలపై ఎంవీవీ స‌త్యనారాయ‌ణ, జీవీ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. అచ్చ తెలుగు అమ్మాయి అంజ‌లి న‌టిస్తోన్న‌ 50వ సినిమా ఇది.

హార‌ర్ కామెడీ జోన‌ర్‌లో భారీ బ‌డ్జెట్‌తో హ్యూజ్ రేంజ్ మూవీగా ‘గీతాంజ‌లి మ‌ళ్లీ వ‌చ్చింది’ని మేక‌ర్స్ తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో రిలీజ్ చేస్తున్నారు. ‘గీతాంజలి’ సినిమా ఎక్కడ ముగిసిందో అక్కడి నుంచే సీక్వెల్ స్టార్ట్ అవుతుంది. అంజలి, శ్రీనివాస్ రెడ్డి, సత్యం రాజేష్, షకలక శంకర్‌లతో పాటు ఈ సీక్వెల్‌లో స‌త్య‌, సునీల్‌, ర‌విశంక‌ర్‌, శ్రీకాంత్ అయ్యంగార్ ఇత‌ర ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. అలాగే ‘గీతాంజ‌లి మ‌ళ్లీ వ‌చ్చింది’ సినిమాలో మ‌ల‌యాళ చిత్ర పరిశ్ర‌మ‌కు చెందిన ప్ర‌ముఖ న‌టుడు రాహుల్ మాధ‌వ్‌ను టాలీవుడ్ చిత్ర ప‌రిశ్ర‌మ‌కు ప‌రి చ‌యం చేస్తున్నారు మేక‌ర్స్‌. ఇప్ప‌టి వ‌ర‌కు వ‌చ్చిన హార‌ర్ కామెడీ చిత్రాల‌న్నీ ఒక ఎత్తైతే ‘గీతాంజ‌లి మ‌ళ్లీ వ‌చ్చింది’లో హార‌ర్ కామెడీ వాట‌న్నింటినీ మించేలా ఉంటుంది. హైద‌రాబాద్, ఊటీల్లో ఈ సినిమా క‌థాంశం సాగుతుంది.

యంగ్ టాలెంట్‌ను ఎంక‌రేజ్ చేయ‌టానికి ఎప్పుడూ ముందుండే కోన ఫిల్మ్ కార్పొరేష‌న్ ఈ సినిమా ద్వారా త‌న మార్క్‌ను చాటుకుంటోంది. నిన్ను కోరి, నిశ్శ‌బ్దం చిత్రాల‌కు కొరియోగ్ర‌ఫీ చేసిన అట్లాంటా (యు.ఎస్‌)కు చెందిన కొరియోగ్రాఫ‌ర్ శివ తుర్ల‌పాటిని డైరెక్ట‌ర్‌గా ఈ చిత్రంతో ప‌రిచ‌యం చేస్తున్నారు. ఇప్పటి వరకు 80 శాతం చిత్రీకరణను పూర్తి చేశాం. ఊటీలో ఓ షెడ్యూల్‌ను చిత్రీకరించాల్సి ఉంది. ఆ షెడ్యూల్‌తో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. సినిమాను వచ్చే 2024 ప్రారంభంలో దక్షిణాది భాషల్లో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నాం అని మేకర్స్ పేర్కొన్నారు.

Also Read:తెలుగు రాష్ట్రాల్లో కార్తీక పౌర్ణమి శోభ

- Advertisement -