టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ, ఛలో భామ రష్మిక మందన జంటగా నటించిన చిత్రం ‘గీత గోవిందం’. ఈ మూవీని గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీవాసు నిర్మిస్తున్నారు. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఆగస్టు 15వ తేదీన విడుదల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆహ్లాదకరమైన ప్రోమోలతో అంచనాలు పెంచిన ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చి ఏ మేరకు మెప్పించిందో చూద్దాం…?
కథ:
విజయ్ గోవిందం(విజయ్ దేవరకొండ) ఇంజనీరింగ్ కాలేజీ లెక్చరర్‌గా పనిచేస్తుంటాడు. అమ్మ చిన్నప్పుడే చనిపోవడంతో.. కాబోయే భార్యను ప్రేమగా చూసుకోవాలని విజయ్ గోవిందం అనుకుంటాడు. గుడిలో ఓ అమ్మాయిని చూసి ఇష్టపడతాడు. గోవింద్ చెల్లెలు పెళ్లి ఫిక్స్ అవుతుంది. ఊరికి వెళ్లడానికి బస్సు ఎక్కిన గోవింద్‌కి బస్సులో తను గుడిలో చూసిన అమ్మాయి తారసపడుతుంది. ఆ అమ్మాయి పేరు గీత(రష్మిక మండన్న) అనుకోకుండా గీతకు విజయ్ దేవరకొండ లిప్ లాక్ పెట్టేస్తాడు. విజయ్‌ని తప్పుగా అర్థం చేసుకున్న గీత విషయాన్ని అన్నకు చెప్పేస్తుంది. గీత అన్నయ్యే తన చెల్లెలకు కాబోయే భర్త అని తర్వాత గోవిందంకు తెలుస్తుంది. అప్పుడు గోవిందం ఏం చేస్తాడు? గీత విజయ్ గురించి అన్న దగ్గర చెప్పేస్తుందా? గోవిందం, గీత ఎలా ప్రేమలో పడతారు? చివరికి వారి కథ ఎలాంటి మలుపు తిరుగుతుందనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్:
సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్స్ విజయ దేవరకొండ,రష్మిక నటన,దర్శకుడు పరశురాం డైరెక్షన్,గోపీ సుందర్ అందించిన ఇంకేం ఇంకేం కావాలనే పాట.
సందర్భానుసారంగా వచ్చే హాస్య సన్నివేశాలు,కెమెరా వర్క్ నేపథ్య సంగీతం.
మైనస్ పాయింట్స్:
దర్శకుడు ఎంచుకున్న కథలో కొత్తదనం లేకపోవడం, కాన్‌ఫ్లిక్ట్ పాయింట్ లేదు. భావోద్వేగ సన్నివేశాల్లో రష్మిక ఇంకా బాగా చేసుండాల్సింది. హీరోయిన్.. హీరోని ఇబ్బంది పెట్టే సీన్స్ సినిమాటిక్‌గా అనిపించడం ఈ సినిమాకు మైనస్ పాయింట్స్‌గా చెప్పవచ్చు.
సాంకేతిక విభాగం:
సాంకేతికంగా గీత గోవిందం చాలా బాగుంది. మణికందన్ ఛాయాగ్రహణం బాగుంది. సినిమా అంతా కలర్ ఫుల్ గా సాగుతూ ఆకట్టుకుంటుంది. గోపీసుందర్ స్వరాలు చిత్రానికి బలాన్నిచ్చాయి. పాటలు బయట వినిపించినంత అందంగా, తెరపై కనిపించలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. దర్శకుడు పరశురామ్‌లో మంచి రచయిత ఉన్నాడని ఈ చిత్రంతో మరోమారు రుజువైంది. సన్నివేశాలు రాసుకున్న విధానంలో ఆయన పనితనం ప్రత్యేకంగా కనిపిస్తుంది.
తీర్పు:
దర్శకుడు పరశురామ్ చక్కని పాయింట్‌తో సినిమాను తెరకెక్కించారు. తన కథకు తగ్గ హీరో నటిస్తే ఎలాంటి కమర్షియల్ బ్లాక్‌బస్టర్ తీయగలనో పరశురామ్ ఈ చిత్రంతో నిరూపించుకున్నాడు. సంగీతం, అందమైన ఫోటోగ్రఫీ, ఈ చిత్రానికి వున్న అదనపు ఆకర్షణలు. నిత్యామీనన్, అనూ ఇమ్మాన్యూయల్ అతిథి పాత్రలు ప్రత్యేక ఆకర్శణగా నిలిచాయి. కథకు తగ్గ నటీనటులతో పాటు ప్రతిభ గల సాంకేతిక నిపుణులు కలిసి పనిచేస్తే ఎలాంటి అవుట్‌పుట్ వస్తుందో గీత గోవిందం నిరూపించింది. ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు యూత్‌ను కూడా ఆకట్టుకుంటుంది. అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ కెరీర్‌లో మరో కమర్షియల్ బ్లాక్‌బస్టర్ గీత గోవిందం.
సినిమా పేరు: గీత గోవిందం
విడుదల తేదీ:15/08/2018
రేటింగ్:2.7/5
నటీనటులు: విజయ్ దేవరకొండ, రష్మిక మందన,
సంగీతం: గోపీ సుందర్
నిర్మాతలు: అల్లు అరవింద్, సత్య గామిడి, బన్నీ వాసు
దర్శకత్వం: పరశురాం