‘గీత గోవిందం’ 3 రోజుల వసూళ్లు..!

259
- Advertisement -

ఇప్పుడు ఎక్కడ చూసినా యూత్ అంతా కూడా ‘గీత గోవిందం’ సినిమాను గురించే మాట్లాడుకుంటోంది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై.. విజయ్ దేవరకొండ – రష్మిక ల కాంబోలో పరశురామ్ తెరకెక్కించిన `గీత గోవిందం` బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. బన్నీవాసు నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోనూ భారీ వసూళ్లను రాబడుతోంది. తొలి రెండు రోజుల్లోనే దాదాపు 25 కోట్ల గ్రాస్ వసూలు చేసిన ఈ చిత్రం…వీకెండ్ లో మరిన్ని కలెక్షన్లు రాబడుతుందని చిత్ర యూనిట్ ధీమాగా ఉంది.

Geetha Govindam Movie

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 3 రోజుల్లో ఈ సినిమా 37.45 కోట్ల గ్రాస్ ను వసూలు చేసి ఆశ్చర్యచకితులను చేసింది. ఒక్క నైజామ్ ఏరియాలోనే ఈ సినిమా 10.04 కోట్ల గ్రాస్ ను వసూలు చేయడం విశేషం. ఇక ఓవర్సీస్ విషయానికి వస్తే అక్కడ ఈ 3 రోజుల్లో 5.65 కోట్ల గ్రాస్ ను రాబట్టింది. అంచనాలకి తగినట్టుగానే ఈ వీకెండ్ పూర్తయ్యేనాటికి ఈ సినిమా 50 కోట్లకి పైగా గ్రాస్ ను వసూలు చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

- Advertisement -