స్టార్ హీరో విజయ్‌దేవరకొండ హీరోగా, రష్మిక మందాన్న జంటగా పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం” గీత గోవిందం”. ప్రోడ్యూసర్ బన్నివాసు నిర్మాణంలో ఎస్ ప్రోడ్యూసర్ శ్రీ అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌లో ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం. “గీత గోవిందం మొదటి సింగిల్‌ని జులై 10న ఉదయం 11.50 కి విడదుల చేస్తున్నారు. ఈ చిత్రాన్ని అన్నికార్యక్రమాలు పూర్తి చేసి ఆగష్టు 15న విడుదల చేస్తున్నారు.
చిత్ర సమర్పకులు శ్రీఅల్లు అరవింద్ మాట్లాడూతూ.. “గీత గోవిందం” చిత్రం మొదటి సింగిల్ ఇంకేమ్ ఇంకేమ్ ఇంకేమ్ కావాలే అని లిరిక్‌తో స్టార్టవుతుంది. అనంత్ శ్రీరాం సాహిత్యాన్ని అందించారు. గోపి సుందర్ క్యాచి ట్యూన్ ని ఇచ్చారు. ఈ సింగిల్ ని జులై 10న ఉదయం 11.50కి విడుదల చేస్తున్నాము. ఈ చిత్రంలో లుక్ దగ్గర నుండి కెరక్టరైజేషన్ వరకూ విజయ్ దేవరకొండ అందర్ని ఆకట్టుకుంటాడు. విజయ్ చాలా మంచి ఫ్యాషన్‌తో ఈ పాత్ర చేశాడు. పక్కా ఫ్యామిలి ఎంటర్‌టైనర్ గా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుంది. పరుశురాం బాగా రాసుకున్నాడు. దాన్ని స్క్రీన్ మీద చూపించాడు. హీరోయిన్ రష్మిక పాత్ర పేరు గీత.. ఈ పాత్రలో ఒదిగిపోయి నటించింది. అగష్టు 15న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. అని అన్నారు.
దర్శకుడు పరుశురామ్ (బుజ్జి) మాట్లాడుతూ.. గీతాఆర్ట్స్ లో శ్రీరస్తు శుభమస్తు చిత్రం చాలా మంచి మ్యూజికల్ హిట్ గా నిలిచింది. అదే విదంగా మా గీత గోవిందం కూడా మ్యూజిక్ లవర్స్ ని ఆకట్టుకుంటుంది. గోపిసుందర్ అందించిన మొదటి సింగిల్‌ని జులై 10న ఉదయం 11.50కి విడుదల చేస్తున్నాము. ఈ చిత్రం పోస్ట్ ప్రోడక్షన్ కార్యక్రమాల్లో వుంది. గీత గోవిందం చిత్రాన్ని రోమాంటిక్ ఫ్యామిలి ఎంటర్‌టైనర్ గా ప్రేక్షకుల ముందుకు అగష్టు 15న తీసుకువస్తున్నారు. శ్రీ అల్లు అరవింద్ బ్లెస్సింగ్స్ తో బన్ని వాసు సపోర్ట్ తో ఈ చిత్రం చాలా బాగా వచ్చింది. సన్సెషనల్ స్టార్ విజయ్ దేవర కొండ చాలా అందంగా కనిపిస్తాడు. అంతేకాదు పాత్ర చాలా రొమాంటిక్ గా వుంటుంది. అర్జున్ రెడ్డి తరువాత విజయ్ ఎలాంటి పాత్రలో కనిపిస్తాడు అనే క్యూరియాసిటి వున్న ప్రేక్షకుడు సంతృప్తి చెందుతాడు. తన ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని ఈ పాత్రని డిజైన్ చేశాను. మా గోవిందం తన యాటిట్యూడ్ ఎక్కడా తగ్గదు. చక్కటి ఫ్యామిలి ఎమెషన్స్‌తో అందర్ని అలరిస్తాడు. రష్మిక చాలా బాగా చేసింది. అగష్టు 15 డేట్ ని సేవ్ చేసుకోండి.. అని అన్నారు.
నిర్మాత బన్ని వాసు మాట్లాడుతూ.. గీతాఆర్ట్స్ అదినేత శ్రీ అల్లు అరవింద్ చిత్ర సమర్పకులుగా నేను నిర్మాతగా నిర్మిస్తున్న చిత్రం గీత గోవిందం. ఈ చిత్రానికి సంబందించి మొదటి లుక్ అండ్ డేట్ పోస్టర్ ఇప్పటికే ట్రెండింగ్ అయ్యాయి. ఇప్పడు మొదటి సారిగా సింగిల్ సాంగ్‌తో ప్రమెషన్ ని స్టార్ట్ చేస్తున్నాము. ఇంకేమ్ ఇంకేమ్ ఇంకేమ్ కావాలే అనే లిరిక్ తో స్టార్టవుతుంది. ఈ సింగిల్ ని జులై 10న ఉదయం 11.50కి విడుదల చేస్తున్నాము. అనంత్ శ్రీరాం చాలా మంచి సాహిత్యాన్ని అందించారు. విజయ్ దేవరకొండ సూపర్ ఫెర్‌ఫార్మెన్స్ తో మరోక్కసారి ప్రేక్షకుల ముఖ చిత్రాన్ని తనవైపుకు తిప్పుకుంటాడనే నమ్మకం మాకుంది. పరుశురాం కి ఫ్యామిలి ఎమెషన్స్ ని తెరకెక్కించటం వెన్నతో పెట్టిన విధ్య. ఈ చిత్రం మరోక్కసారి పక్కాఫ్యామిలి ఎంటర్‌టైనర్ గా ప్రేక్షకుల ప్రశంశలు పోందుతుంది. గోపిసుందర్ సంగీతం ఈ చిత్రానికి ప్రాణం. గీత గోవిందం చేసే అల్లరి కొసం ఆగష్టు 15న వరకూ ఆగాల్సిందే.. అని అన్నారు
నటీనటులు..విజయ్ దేవరకొండ, రష్మిక మందాన్న, నాగబాబు, సుబ్బరాజు, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, గిరిబాబు, అన్నపూర్ణమ్మ, మౌర్యాని, సుభాష్, అభయ్, స్వప్నక, సత్యం రాజేష్, దువ్వాసి మెహన్, గుండు సుదర్శన్, గౌతంరాజు, అనీష, కళ్యాణి నటరాజన్, సంధ్య జనక్ తదితరులు…
సాంకేతిక నిపుణులు..సమర్పకులు.. అల్లు అరవింద్ నిర్మాత.. బన్నివాసు, కథ-స్క్రీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం… పరుశురామ్, సంగీతం.. గోపిసుందర్, సినిమాటోగ్రాఫర్.. మణికందన్, ఎడిటర్.. మార్తాండ్.కె.వెంకటేష్, ఆర్ట్.. రమణ వంక, ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూసర్.. సత్య గమిడి, స్క్రిప్ట్ కొ-ఆర్డినేటర్.. సీతారామ్, లిరిక్స్.. అనంత్ శ్రీరామ్, శ్రీమణి, కొరియోగ్రాఫి… రఘు, జాని, పబ్లిషిటి డిజైనర్.. అనిల్ భాను, పి ఆర్ ఓ.. ఏలూరు శ్రీను.