TTD:ఘనంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు

19
- Advertisement -

ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలో ఒంటిమిట్ట శ్రీ కోదండ‌ రామాల‌య బ్ర‌హ్మోత్స‌వాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేయాలని టీటీడీ జేఈవో వీర‌బ్ర‌హ్మం అధికారులను ఆదేశించారు. టీటీడీ ఆగమసలహాదారులను సంప్రదించి బ్రహ్మోత్సవాలకు అవసరమైన బుక్ లెట్ ను, శ్రీ సీతారాముల కల్యాణం ముహూర్త పత్రికను సిద్ధం చేయాలని కోరారు.

ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో కల్యాణ వేదిక వద్ద బారికేడ్లు, క్యూలైన్లు, గ్యాలరీలు, రూట్ మ్యాప్ సిద్ధం చేయాలన్నారు. గ్యాలరీల్లోని భక్తులకు తలంబ్రాలు, అన్నప్రసాదాలు, తాగునీరు అందించేందుకు సర్వీస్ రూట్ ఏర్పాటు చేయాలన్నారు. గ్యాలరీలోని భక్తులందరికీ అన్నప్రసాదాలు సక్రమంగా అందేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు.

మెరుగైన పారిశుద్ధ్యం కోసం ప్రత్యేకంగా కార్యాచరణ రూపొందించాలని, తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఆలయం, కళ్యాణవేదిక వద్ద శోభాయమానంగా విద్యుత్ దీపాలంకరణలు ఏర్పాటు చేయాలన్నారు. వైద్య బృందాలను అందుబాటులో ఉంచాలన్నారు. హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు, శోభాయాత్ర నిర్వహించాలని సూచించారు.

Also Read:‘గుంటూరుకారం’ హిట్ అవ్వాలంటే?

- Advertisement -