ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లాలో జీబీఎస్ వైరస్ కేసులు కలకలం రేపుతున్నాయి. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో 2 రెండు కేసు నమోదు అయ్యాయి. వైద్య పరీక్షల కోసం కాకినాడ జీజీహెచ్ కి తరలించారు. ఇటీవలే విశాఖలో ఓ మహిళా మరణించడంతో ఏపీ వాసులు భయాందోళనకు గురవుతున్నారు.
జ్వరం, జలుబు, దగ్గు, డయేరియా వంటివి వచ్చి తగ్గిన వారం, పది రోజుల్లో కాళ్లు, చేతులు నీరసంగా ఉండడం,తిమ్మిర్లు ఎక్కడం, గొంతులోకి ముద్ద దిగకపోవడం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే వెంటనే డాక్టర్లు సంప్రదించాలని సూచిస్తున్నారు. అలాగే కాళ్లలో మంటలు వంటి లక్షణాలు కనిపిస్తే అప్రమత్తం కావాలని వైద్యులు సూచిస్తున్నారు.
బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్ల వల్ల ఈ వ్యాధి వస్తుంది. వేగంగా అభివృద్ధి చెంది రోగ నిరోధక శక్తిపై దాడిచేస్తుంది. దీనివల్ల శ్వాసకోశ కండరాలు ప్రభావితమైతే.. ఇంటెన్సివ్ కేర్‌లో వెంటిలేషన్‌పై ఉంచి చికిత్స అందించాల్సి ఉంటుంది. అయితే జీబీఎస్ అంటువ్యాధి కాదని ప్రజలకు డాక్టర్లు సూచిస్తున్నారు.
Also Read:వీరమల్లు రిలీజ్ డేట్‌పై క్లారిటీ!

