సీఎం కేసీఆర్‌ను కలిసిన రాజ్య‌స‌భ సభ్యుడు గాయ‌త్రి ర‌వి..

132
gathri ravi
- Advertisement -

రాజ్య‌స‌భ సభ్యుడిగా టీఆర్ఎస్ అభ్యర్థి వ‌ద్దిరాజు ర‌విచంద్ర‌ (గాయ‌త్రి ర‌వి) ఏక‌గ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఈరోజు ఆయన కుటుంబ సమేతంగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును ప్రగతి భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. రాజ్య‌సభ‌కు ఏక‌గ్రీవంగా ఎన్నికైన గాయ‌త్రి ర‌విని సీఎం కేసీఆర్‌ అభినందించారు.

కాగా,తెలంగాణ కోటా నుంచి రాజ్యసభకు బండా ప్రకాశ్‌ ముదిరాజ్‌ రాజీనామా చేయడంతో ఏర్పడిన ఖాళీలో వద్దిరాజు రవిచంద్ర ఎన్నికయ్యారు. ఈ నెల 12 నుంచి 18 వరకు రాజ్యసభ ఉప ఎన్నిక స్థానానికి నామినేషన్లు స్వీకరించారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా వద్దిరాజు రవిచంద్ర ఒక్కరే నామినేషన్‌ వేయడంతో 23న ఉపసంహరణ గడువు ముగిశాక గాయ‌త్రి ర‌వి ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు రిటర్నింగ్‌ అధికారి ప్రకటించారు. రవిచంద్ర అసెంబ్లీ ఆవరణలో రిటర్నింగ్‌ అధికారి చేతుల మీదుగా సోమవారం ధ్రువీకరణ పత్రం అందుకున్నారు.

- Advertisement -