రివ్యూ: గాయత్రి

311
- Advertisement -

డైలాగ్ కింగ్ మోహన్ బాబు లీడ్ రోల్‌లో మంచు విష్ణు, శ్రియ జోడీగా నటిస్తున్న చిత్రం ‘గాయత్రి’ . మదన్ దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్‌పై మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రం భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకువచ్చింది. చాలాకాలం తర్వాత తెలుగు తెరపై తనదైన డైలాగ్‌లతో మెప్పించేందుకు వచ్చిన డైలాగ్ కింగ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడా..సినిమా సక్సెస్ సాధించిందా లేదా చూద్దాం…

కథ :

మాఫియా డాన్ అయినా గాయత్రి పటేల్ క్రైమ్ వరల్డ్ లో నిరంకుశంగా పరిపాలిస్తుంటాడు. అతని గురించి కనుక్కోవాలని జర్నలిస్ట్ అయిన చండీ ప్రయత్నిస్తుంది. అయితే ఇదే క్రమంలో సామాన్యుడు (మోహన్ బాబు ) గాయత్రీ పటేల్ ని ఎదిరిస్తూ ఉంటాడు. అసలు గాయత్రి గతం ఏంటి. అమాయకంగా బ్రతికే సాధారణ నటుడు అయిన గాయత్రి ఎందుకు అలా మారతాడు. చివరికి కథ ఎలా సుఖాంతం అయింది అన్నదే గాయత్రి కథ.

Gayatri movie review

ప్లస్ పాయింట్స్:

సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్స్ మోహన్ బాబు నటన,పొలిటికల్ డైలాగ్స్. డైలాగ్ కింగ్ మోహన్ బాబు ద్విపాత్రాభినయంలో అద్భుతంగా నటించాడు. ప్రతీ సన్నివేశంలోనూ తనమార్క్ చూపించాడు. ముఖ్యంగా మోహన్ బాబు డైలాగ్‌లకు ఫ్యాన్స్ ఫిదా కావాల్సిందే. మంచు విష్ణు,శ్రీయ తమ పాత్రలకు న్యాయం చేశారు. వీరిద్దరి కెమిస్ట్రీ అద్భుతంగా పండింది. బ్రహ్మానందం,అలీ,కోట శ్రీనివాసరావు,తనికెళ్ల భరణి తమదైన నటనతో మెప్పించారు.

మైనస్ పాయింట్స్:

సినిమాకు మేజర్ మైనస్ పాయింట్స్ స్లో నేరేషన్,అక్కడక్కడా బోర్ కొట్టే సన్నివేశాలు. పాత కథకి ప్రస్తుతం ఉన్న రాజకీయ సంఘటనలని అల్లుకోవడం వల్ల ప్రేక్షకుడు కనెక్ట్ అవుతాడు. దర్శకుడు మదన్ నుంచి వచ్చిన సినిమాలలో ఇది కాస్త వీక్ అనే చెప్పాలి.

సాంకేతిక విభాగం :

సాంకేతికంగా సినిమాకు మంచి మార్కులే పడ్డాయి. మోహన్ బాబు ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. తమన్ సంగీతం ఈ సినిమాకి మరో పెద్ద ప్లస్. సర్వేశ్ మిరారి అందించిన కెమెరా వర్క్ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు అక్కడక్కడా పేలే పంచ్ డైలాగులు బాగున్నాయి.

Gayatri movie review

తీర్పు:

1990 ల నాటి కథాంశంతో తెరకెక్కిన సినిమా గాయత్రి. మోహన్ బాబు నటన,డైలాగ్‌లు సినిమాకు మేజర్ ప్లస్ కాగా స్లో నేరేషన్ మైనస్ పాయింట్స్. ఓవరాల్‌గా మోహన్ బాబు సినిమాలు నచ్చేవారికి పండగలాంటి మూవీ గాయత్రి.

విడుదల తేదీ:09/02/2018
రేటింగ్:2.5/5
నటీనటులు : మోహన్ బాబు, మంచు విష్ణు , శ్రేయ
సంగీతం :తమన్
నిర్మాత :మోహన్ బాబు
దర్శకత్వం :ఆర్ ఆర్ మదన్

- Advertisement -