‘గాయత్రి’ సెన్సార్‌ పూర్తి..9న రిలీజ్‌..

238
Gayatri gets U/A certificate from censors, all set for grand release on Feb 9th
- Advertisement -

డా. మోహన్ బాబు ప్రధాన పాత్ర లో నటిస్తున్న ‘గాయత్రి’ చిత్రం సెన్సర్స్ కార్యక్రమాలు పూర్తిచేసుకొని ఫిబ్రవరి 9 న భారీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఇటీవలే విడుదలైన ట్రైలర్ కు అద్భుత స్పందన వస్తుంది. మోహన్ బాబు ఇంటెన్స్ లుక్ మరియు పవర్ఫుల్ డైలాగులతో కూడిన ట్రైలర్ చిత్రంపై ఆసక్తిని భారీగా పెంచేసాయి.

 Gayatri gets U/A certificate from censors, all set for grand release on Feb 9th

అంతేకాకుండా ఎస్ తమన్ స్వరపరిచిన చిత్ర పాటలకు విశేష స్పందన వస్తుంది. గాయత్రిలో విష్ణు మంచు ఓ పవర్ ఫుల్ పాత్రలో కనిపించనుండటం చిత్రానికి మరో హైలైట్. శ్రియ ఆయన సరసన జంటగా మొదటి సరి నటించారు.

మదన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నిఖిల విమల్, అనసూయ భరద్వాజ్, బ్రహ్మానందం ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఫిబ్రవరి 9 న మన ముందుకు రాబోతున్న గాయత్రీ చిత్రాన్ని డా.యమ్.మోహన్ బాబు తన ప్రతిష్టాత్మక బ్యానర్ అయిన శ్రీ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్ పై నిర్మించగా అరియానా, వివియానా మరియు విద్యా నిర్వాణ సమర్పిస్తున్నారు.

- Advertisement -