‘గాయపడ్డ సింహం’ ..అద్భుత చిత్రం!

3
- Advertisement -

డిఫరెంట్ ఎంటర్టైనర్స్ చేస్తున్న తరుణ్ భాస్కర్, రైటర్- డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్‌తో కలిసి ‘గాయపడ్డ సింహం’ తో అలరించబోతున్నారు. ఈ చిత్రాన్ని సప్తస్వ మీడియా వర్క్స్, పిఓవి స్టోరీస్, జీ స్టూడియోస్ నిర్మిస్తున్నాయి. పవన్ సాదినేని ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఇటివల విడుదలైన ఫన్ ఫిల్డ్ ట్రైజర్‌ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా సినిమాకు సంబంధించిన ఫన్ ప్రమోషనల్ ర్యాప్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పాట సినిమా సాటైరికల్ టోన్‌ను అద్భుతంగా ప్రజెంట్ చేస్తోంది.

ఈ పాట హీరో అమెరికన్ డ్రీమ్ ఎలా ఒక్కసారిగా తలకిందులవుతుందో చూపిస్తుంది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించిన డిపోర్టేషన్ నిర్ణయం తర్వాత హీరో జీవితంలో ఏర్పడే గందరగోళ పరిస్థితులను సరదాగా చూపించారు.ట్రెండీ బీట్స్‌తో రూపొందిన ఈ ర్యాప్ సాంగ్‌ను సంగీత దర్శకుడు స్వీకర్ అగస్తీ స్వయంగా ఆలపించగా, ర్యాప్ పార్ట్స్ అసుర పాడారు. సాహిత్యాన్ని కూడా స్వీకర్ అగస్తి రాయగా, అసురా ర్యాప్ వర్సెస్ అందించారు. పాస్‌పోర్ట్‌పై పడే రిజెక్షన్ స్టాంపులు, ట్రంప్ విగ్రహాలు, “హ్యాపీ డిపోర్టేషన్” కేక్ కట్టింగ్ వంటి సరదా సన్నివేశాలతో పాట వినోదాత్మకంగా సాగుతుంది.

వీడియోలో ఎనర్జీతో నిండిన డ్యాన్స్ మూమెంట్స్, సరదా విజువల్స్ ప్రత్యేకంగా ఆకట్టుకుంటాయి. తరుణ్ భాస్కర్ తన డెడ్‌పాన్ హ్యూమర్‌తో నవ్వులు పండించగా, విష్ణు ఓయి బడ్డీ వైబ్‌ను తీసుకొచ్చారు. టైటిల్‌కు తగినట్లు ఒక సింహం కూడా విజువల్‌గా కనిపిస్తూ కథలోని “గాయపడ్ద సింహం” ను సూచిస్తుంది. స్వీకర్ అగస్తి, అసురా కూడా వీడియోలో కనిపిస్తూ ఫన్ మరింత పెంచారు.

ఈ చిత్రంలో మానస చౌదరి, ఫరియా అబ్దుల్లా కథానాయికలు కాగా, హర్షవర్ధన్, శుభలేఖ సుధాకర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.విద్యా సాగర్ చింతా సినిమాటోగ్రఫీ, విప్లవ్ నైషదం ఎడిటింగ్‌న, చంద్రిక గొర్రెపాటి ప్రొడక్షన్ డిజైన్‌, సూర్య ప్రకాష్ జ్యోసుల కథను అందిస్తున్నారు.ఈ చిత్రం2026 వేసవిలో థియేటర్లలో విడుదల కానుంది.

సాంగ్ లాంచ్ ఈవెంట్లో హీరో తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ.. అందరికీ హాయ్. మీ అందరి ఎనర్జీ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. ఈ వైబ్ చూస్తుంటే చాలా ఎనర్జీ వస్తోంది. ఈ సాంగ్ మీ అందరికీ నచ్చడం హ్యాపీగా వుంది. కశ్యప్ శ్రీనివాస్‌ తన కాలేజ్ డేస్ నుంచే చాలా కష్టపడి షార్ట్ ఫిలిమ్స్ తీసి తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నాడు. ఈ సినిమాతో తను దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. అసలైన హీరో ఈ సినిమాకి ఆయన, ఆయన కథ. కష్టపడ్డ సింహం ఆయన. అదృష్టమైన సింహాన్ని నేను. మా నిర్మాతలకి థాంక్ యు. తప్పకుండా ఈ సినిమాని మీ ఫ్రెండ్స్ తో ఫ్యామిలీతో కలిసి చూడండి.

ప్రొడ్యూసర్ భాను కిరణ్ మాట్లాడుతూ.. మీ అందరి కోసం ఈ సినిమాని మా డైరెక్టర్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ గా తీశాడు. సినిమా చాలా బాగా వచ్చింది. అన్ని పాటలు కూడా చక్కగా కుదిరాయి. ఒక డైరెక్టర్ గా తరుణ్ అంటే మనందరికీ ఇష్టం. ఈ సినిమా యాక్టర్ ఇష్టపడతారు.ఈ సినిమాలో తన యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ఈ సినిమాలో చాలా సర్ప్రైజులు ఉన్నాయి. ఒక్కొక్కటి రివిల్ చేస్తూ ఉంటాం. ఏప్రిల్ లో రిలీజ్ చేయాలనుకుంటున్నాం. తప్పకుండా ఈ సాంగ్ ని అందరితో షేర్ చేయాలని కోరుకుంటున్నాను.

డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. అందరూ మన కలలని చేరుకోవాలి. ఈ ప్రయాణంలో అందరం గాయపడతాం. గాయపడ్డ సింహాలవుతాం. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ అవుతుంది. మిమ్మల్ని అందరిని ఎంటర్టైన్ చేస్తుంది. తరుణ్ గారు బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు మిమ్మల్ని అందరిని ఎంటర్టైన్ చేస్తారు .లిరిక్ రైటర్ రాపర్ ప్రమోద్ అసుర మాట్లాడుతూ.. సినిమా చాలా క్రేజీగా ఉంటుంది. త్వరలోనే ఈ సినిమా మీ ముందుకు వస్తుంది.ఇంకో నాలుగు పాటలు ఉన్నాయి. ఆ పాటలన్నీ కూడా మిమ్మల్ని అలరిస్తాయి.తారాగణం: తరుణ్ భాస్కర్, ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి, విష్ణు ఓయి, హర్షవర్ధన్, శుభలేఖ సుధాకర్, తదితరులు

Also Read:ఇంట్రెస్టింగ్‌గా విక్రమ్ ఆన్ డ్యూటీ!

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: కాశ్యప్ శ్రీనివాస్
సమర్పణ: పవన్ సాదినేని
నిర్మాతలు: కళ్యాణ చక్రవర్తి మంతిన, భాను కిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సాల్
బ్యానర్లు: సప్తస్వ మీడియా వర్క్స్, POV స్టోరీస్, జీ స్టూడియోస్
DoP: విద్యా సాగర్ చింత
సంగీతం: స్వీకర్ అగస్తీ
ఎడిటర్: విప్లవ్ నిషాదం
ప్రొడక్షన్ డిజైనర్: చంద్రిక గొర్రెపాటి
కథ: సూర్య ప్రకాష్ జ్యోసుల
కాస్ట్యూమ్ డిజైనర్: అపూర్వ రెడ్డి
క్రియేటివ్ ప్రొడ్యూసర్: శ్రీని జోస్యుల
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: పెన్మత్స అజయ్ వర్మ
PRO: వంశీ-శేఖర్
డిజిటల్ మీడియా: హ్యాష్‌ట్యాగ్ మీడియా
సౌండ్ డిజైన్: సింక్ సినిమాస్
Vfx & టైటిల్ యానిమేషన్: ఎగ్ వైట్
పబ్లిసిటీ డిజైన్: ఎల్లోటూత్స్

- Advertisement -