ఏపీపీఎస్సీ చైర్మన్‌గా నియమితులయ్యారు ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్. ఐపీఎస్ పదవికి రాజీనామా చేసిన గౌతమ్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీపీఎస్సీ ఛైర్మన్‌గా నియమిస్తూ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.
1986 బ్యాచ్‌కు చెందిన సవాంగ్.. చిత్తూరు జిల్లా మదనపల్లె ఏఎస్పీగా ఉద్యోగ జీవితం ప్రారంభించారు. అనంతరం వరంగల్ జిల్లా ఎస్పీగా బాధ్యతలు నిర్వహించారు. 2001 నుంచి 2003 వరకు వరంగల్ రేంజి డీఐజీగా, 2003-2004 వరకు స్పెషల్ బ్రాంచ్ డీఐజీగా, 2004-2005 వరకు ఏపీఎస్పీ డీఐజీగా పనిచేశారు.
రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ సర్వీసుల్లోకి వెళ్లిన ఆయన 2016-2018 వరకు విజయవాడ సీపీగా, 2018 జులైలో విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. 2019 ఆగస్టు 3న ఏపీ డీజీపీగా బాధ్యతలు చేపట్టారు. 2023, జూలైలో పదవీ విరమణ చేయనున్నారు.

