2002లో నమోదైన రెండు రేప్ కేసుల్లో డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ కు 20 సంవత్సరాల జైలు శిక్షపడిన విషయం తెలిసిందే. అయితే తాజాగా డేరా..రేప్ కేసు తీర్పు పై భారత క్రికెటర్ గౌతమ్ గంభీర్ స్పందిచారు.
గుర్మీత్ అత్యాచార కేసుపై సీబీఐ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును మహిళా విజయంగా అభివర్ణించాడు. ఇప్పటికే సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జగ్దీప్ సింగ్ ఇచ్చిన తీర్పును ఎంతో మంది స్వాగతించారు.
అయితే ఇదే క్రమంలో గంభీర్ మరో అంశాన్ని కూడా లేవనెత్తారు. ఎన్సీఆర్బీ 2015 గణాంకాల ప్రకారం, దేశంలోని అన్ని న్యాయస్థానాల్లో 1,37,458 రేప్ కేసుల విచారణ సాగుతోందని గుర్తు చేశాడు. ఆ కేసుల సంగతేంటని, వాటిని కూడా పరిష్కరించాలని అన్నాడు. ఇందుకోసం న్యాయస్థానాలు కృషి చేయాలని కూడా సూచించాడు.
Bravo to d women, CBI court&Justice Singh. Now, let's try 2 resolve over 1,37,458 pending rape trials (NCRB, 2015 data),they r our part too.
— Gautam Gambhir (@GautamGambhir) August 28, 2017