గంభీర్‌పై ఫిర్యాదు చేసిన అతిషి..!

171

ఇండియన్‌ క్రికెటర్, బీజేపీ అభ్యర్థి గౌతం గంభీర్ రెండు ఓటరు గుర్తింపు కార్డులను కలిగి ఉన్నట్లుగా పేర్కొంటూ ఆమ్ ఆద్మీ పార్టీ ఫిర్యాదు చేసింది. ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి అతిషి ఈస్ట్ ఢిల్లీ నియోజకవర్గం నుంచి సార్వత్రిక ఎన్నికల బరిలో ఉన్నారు. బీజేపీ నుంచి ప్రత్యర్థిగా క్రికెటర్ గౌతం గంభీర్ ఉన్నాడు.

Gautam Gambhir

కాగా ఢిల్లీలోని రెండు నియోజకవర్గాల్లో గంభీర్‌కు ఓట్లు ఉన్నాయని వెల్లడించారు. కారోల్‌ బాగ్‌, రాజిందర్‌ నగర్‌లో ఓటు ఉన్నట్టు ట్వీట్‌ చేశారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు ఆమ్‌ అభ్యర్థిని అటిషి మార్లెనా ట్విటర్‌లో ద్వారా తెలిపారు. ప్రజా ప్రాతినిథ్య చట్టంలోని సెక్షన్‌ 125ఏ ప్రకారం ఇది నేరమని, దీనికి ఆరు నెలల వరకు జైలు శిక్ష విధించొచ్చని తెలిపారు.