అంబటి రాయుడికి అన్యాయం జరిగిందిః గౌతమ్ గంభీర్

145
Ambati Rayudu Gowtham Gambhir

నాలుగేళ్ల కొకసారి జరిగే వరల్డ్ కప్ మ్యాచ్ కు అన్నీ దేశాల టీంలు సన్నద్దమవుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఇండియా సెలక్టర్లు వరల్డ్ కప్ కు ఆడే 15మంది పేర్లను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆ లిస్ట్ లో యువ ఆటగాడు అంబటి రాయుడు పేరు లేకపోవడం అన్యాయం అన్నారు. అందరూ రిషబ్ పంత్ కు జట్టులో స్ధానం కల్పించలేదని మాట్లాడుతున్నారు కానీ..ఇక్కడ చర్చించాల్సింది రాయుడు గురించన్నారు.

తెలుపు బంతి క్రికెట్‌లో 48 దాకా సగటు ఉన్న ఆటగాడిని పక్కన పెట్టడం చాలా చాలా దురదృష్టకరం. సెలక్టర్ల నిర్ణయాల్లో అత్యంత బాధాకరమైనది ఇదే. రాయుడి పట్ల విచారం వ్యక్తం చేస్తున్నానని తెలిపారు. 2007నాకు కూడా ఇదే పరిస్ధితి ఎదురైందన్నారు. మెగా ఈవెంట్‌లో ఆడాలనే కళ ప్రతి క్రికెటర్‌ కు ఉంటుందన్నారు . చిన్నప్పటి నుంచే ప్రతి ఆటగాడు కనే కల ఇదే. ఈ స్వప్నం సాకారం కాకపోతే ఎంత బాధగా ఉంటుందో నాకు తెలుసని చెప్పారు. రిషబ్ పంత్ కు ఇంకా చాలా అవకాశాలు వస్తాయని అతని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదన్నారు.