రామమందిర నిర్మాణానికి రూ. కోటి విరాళం: గంభీర్

121
gambhir

దేశవ్యాప్తంగా అయోధ్య రామమందిర నిర్మాణం కోసం విరాళాలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. రాజకీయాలకు అతీతంగా విరాళాలు అందిస్తుండగా తాజాగా భారత మాజీ క్రికెటర్, ఎంపీ గౌతమ్ గంభీర్ భారీ విరాళాన్ని ప్రకటించారు. రూ .కోటి విరాళాన్ని ప్రకటించిన గంభీర్‌ తనతో పాటు తన కుటుంబ సభ్యులు అంతా ఈ విరాళాన్ని అందజేసినట్లు వెల్లడించారు.

వైభ‌వోపేతంగా రామాల‌యం నిర్మించ‌డ‌మే భార‌తీయుల స్వ‌ప్నం అని, ఈ ప్ర‌య‌త్నంలో భాగంగా త‌మ కుటుంబం ఈ చిన్న‌పాటి విరాళం అంద‌జేసిన‌ట్లు తెలిపారు. అయోధ్య‌లో మ‌హాద్భుత‌మైన ఆల‌య నిర్మాణం సాగాల‌ని ఆకాంక్షించారు.