Tirumala:వైభవంగా గరుడ సేవ

50
- Advertisement -

గరుడపంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని సోమవారం రాత్రి తిరుమలలో శ్రీమలయప్పస్వామివారు తనకు ఇష్టవాహనమైన గరుడునిపై తిరుమాడ వీధులలో ఊరేగి భక్తులను కటాక్షించారు. రాత్రి 7 నుండి 9 గంటల నడుమ గరుడ వాహనసేవ అత్యంత రమణీయంగా జరిగింది.

శ్రీవారి వాహనాల్లోను, సేవకుల్లోను అగ్రగణ్యుడు గరుడుడు. ప్రతి ఏడాదీ గరుడ పంచమిని శుక్ల పక్షం ఐదవ రోజు ఘనంగా నిర్వహిస్తారు. నూతన దంపతులు తమ వైవాహిక జీవితం ఆనందదాయకంగా వుండేందుకు, స్త్రీలు తమకు పుట్టే సంతానం గరుడునిలాగా, బలశాలిగా ఉండేందుకు ఈ సందర్భంగా ”గరుడ పంచమి” పూజ చేస్తారు.

Also Read:ట్రెండింగ్‌లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’

- Advertisement -