2016లో తమిళంలో విడుదలై హిట్ సాధించిన చిత్రం ఆరతు సినమ్. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత, అదే సినిమాను తెలుగు ప్రేక్షకుల కోసం “గరుడ 2.0” పేరుతో నేరుగా ఓటీటీలో విడుదల చేశారు. విడుదలైన కొన్ని రోజుల్లోనే ఈ సినిమా క్రైమ్ థ్రిల్లర్ అభిమానుల మనసు దోచుకుంది. ఊహించని ట్విస్టులు, కట్టిపడేసే స్క్రీన్‌ప్లే, భావోద్వేగాలతో కూడిన కథా నిర్మాణం ఈ సినిమాను ప్రత్యేకంగా నిలిపింది.
ఈ చిత్రాన్ని హనుమాన్ బ్యానర్‌పై నిర్మాత బాలు చరణ్ తెలుగులో రిలీజ్ చేశారు. తమిళ నటుడు అరుళ్ నిధి, ‘డిమాంటీ కాలనీ’ వంటి సినిమాల ద్వారా తన నటనా ప్రతిభను నిరూపించుకున్నాడు.
ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన అరివాజగన్ వెంకటాచలం స్క్రీన్‌ప్లే అద్భుతంగా చేశారు. కథను ముందుకు నడిపే విధానం, ప్రతి సన్నివేశంలో ఉత్కంఠను పెంచే టెక్నిక్‌లు సినిమాకి ఓ కొత్త లెవెల్ తీసుకువెళ్లాయి. ప్రస్తుతం ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న గరుడ 2.0, టాప్ 1 ప్లేస్‌లో ట్రెండింగ్‌లో ఉంది.
Also Read:గోవాలోని ఆలయంలో తొక్కిసలాట.. 6గురు మృతి

