వెల్లుల్లి టీ తో ఎన్ని ప్రయోజనాలో..!

34
- Advertisement -

వంటగదిలో ఉపయోగించే పదార్థాలలో వెల్లుల్లి తప్పనిసరిగా ఉంటుంది. ఎటువంటి కూరలోనైనా వెల్లుల్లి ఉంటేనే దాని యొక్క రుచి పెరుగుతుంది. వెల్లుల్లిని కేవలం కూరల్లోనే కాకుండా వివిధ రోగాలకు ఔషధంలా కూడా ఉపయోగిస్తారు. ఇందులో ఉండే అల్లిన్, అల్లైడ్ ప్రొఫైల్, డైసల్ఫెట్, ట్రైసల్ఫెట్.. ఇలా 33 రకాల సర్ఫర్ సమ్మేళనలు ఉంటాయి. ఇవన్నీ కూడా వివిధ రకాల రోగాలను దూరం చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఇంకా శరీరానికి అవసరమయ్యే అమైనో ఆమ్లాలు, జెర్మేనియం, సెలీనియం, వంటి మినరల్స్ కూడా అధికంగా ఉంటాయి. ప్రతిరోజూ ఒకటి లేదా రెండు రెబ్బల వెల్లుల్లి తినడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. అయితే వెల్లుల్లిని నేరుగా తినడం కంటే టీ రూపంలో సేవిస్తే మరి మంచిదని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. .

వెల్లుల్లి టీ తయారు చేయడం కూడా చాలా సులభం. ముందుగా ఒక పాత్రలో నీటిని తీసుకొని బాగా మరిగించి ఒక స్పూన్ అల్లం తురుము, ఒక వెల్లుల్లి రెబ్బ వేసి సుమారు 20 నిమిషాల పాటు మరిగించాలి. ఆ తరువాత చల్లార్చి ఒక గ్లాస్ లోకి తీసుకొని కొద్దిగా నిమ్మరసం, కొద్దిగా తేనె కలిపి సేవించాలి. ఇలా ప్రతిరోజూ వెల్లుల్లి టీ తయారు చేసుకొని ఉదయం పూట తాగడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. ఇంకా చర్మం పై ఎలాంటి ఫంగస్ ఇన్ఫెక్షన్లు ఉన్నా.. వాటి నుంచి కూడా విముక్తి లభిస్తుంది. ఇంకా అధిక బరువుతో బాధపడే వారు తప్పనిసరిగా వెల్లుల్లి టీ తాగడం మంచిదట. ఎందుకంటే ఇందులో కొవ్వును కరిగించే గుణాలు మెండుగా ఉంటాయి. ఇంకా మధుమేహం, రక్తపోటు వంటి సమస్యలను దూరం చేయడంలో కూడా వెల్లుల్లి టీ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇంకా శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచి బ్యాక్టీరియా, క్యాన్సర్ కారకాలు.. వంటి వాటిని నిరోధిస్తుంది. కాబట్టి ఎన్నో ఉపయోగాలు ఉన్న వెల్లుల్లి టీ తాగడం అలవాటు చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

Also Read:Saindhav:‘సైంధవ్’ ఫస్ట్ సింగిల్

- Advertisement -