వెల్లుల్లి గురించి మనందరికి తెలిసే ఉంటుంది. కూరల రుచిని పెంచడంలో వెల్లుల్లి పాత్ర చాలా ఉంటుంది. కేవలం రుచిని పెంచడంలో మాత్రమే కాకుండా ఆయుర్వేదంలో కూడా వెల్లుల్లికి ప్రత్యేక స్థానం ఉంది. వివిద రకాల అనారోగ్య సమస్యలకు వెల్లుల్లిని దివ్య ఔషధంలా ఉపయోగిస్తూ ఉంటారు ఆయుర్వేద నిపుణులు. వెల్లుల్లిలో విటమిన్ బి1, బి6, విటమిన్ సి వాటితో పాటు మాంగనీస్, కాల్షియం, కాపర్, సెలీనియం వంటి మూలకాలు ఎన్నో ఉంటాయి. ఇవన్నీ కూడా మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.
కాగా ఆరోగ్య నిపుణులు చెబుతున్న దాని ప్రకారం వెల్లుల్లిని చాలా మంది పచ్చిగానే రెబ్బలుగా తింటూ ఉంటారు. ఇక కాకుండా వెల్లుల్లిని రసంలా చేసుకొని సేవిస్తే మరి మంచిదట. వెల్లుల్లిని రసంలా చేసుకొని ప్రతిరోజూ ఉదయం పడగడుపున పాలలో కలిపి తాగితే పురుషుల్లో వచ్చే శృంగార సమస్యలు దురమౌతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అంతే కాకుండా వెల్లుల్లి రసాన్ని ప్రతిరోజూ తాగడం వల్ల గుండెకు రక్త ప్రసరణ మెరుగుపడుతుందట. తద్వారా గుండె సంబంధిత వ్యాధులు రావని పలు అధ్యయనలు చెబుతున్నాయి. వెల్లుల్లి రసం చర్మంపై ఉండే మచ్చలను, మొటిమలను తొలగించడంలో కూడా కీలక పాత్ర పోషిస్తుందట.
వెల్లులి రసాన్ని మొఖానికి ( మొటిమలు, మచ్చలు ఉన్న చోట మాత్రమే ) అప్లై చేసి పది నుంచి పదిహేను నిమిషాల తరువాత కడిగేస్తుకుంటే మొఖంపై ఉండే మచ్చలు, మొటిమలు తగ్గుతాయట. ఇక వెల్లుల్లి రసం జుట్టు రాలడాన్ని కూడా తగ్గిస్తుందని ఆయుర్వేద శాస్త్రాలు చెబుతున్నాయి. జుట్టు రాలిన ప్రదేశంలో వెల్లుల్లి రసాన్ని అప్లై చేసి కొద్ది సేపు నెమ్మదిగా మర్దన చేసి ఆ తరువాత కడిగేసుకుంటే రాలిన చోట జుట్టును తిరిగి మొలిచేలా చేస్తుందట. తలపై వెల్లుల్లి రసాన్ని అప్లై చేసేటప్పుడు కళ్ళలో పడకుండా జాగ్రత వహించాలి. ఇక వెల్లుల్లి రసంతో కొద్దిగా దానిమ్మ రసం కలుపుకొని సేవిస్తే వర్షాకాలంలో తరచూ వేదించే జలుబు, దగ్గు, గొంతునొప్పి సమస్యలు కూడా దూరం అవుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
Also Read: అవార్డు సినిమా తీసి.. ఆసుపత్రి పాలు
గమనిక : ఈ వార్త ఇంటర్నెట్ లోని సమాచారం మేరకు అందించడం జరుగుతుంది. కాబట్టి ఫాలో అయ్యే ముందు ఆయుర్వేద నిపుణల సలహాలు తీసుకొని ఫాలో కావడం మంచిది.