చలికాలంలో వెల్లుల్లి తింటే ఏమౌతుంది?

33
- Advertisement -

వెల్లుల్లి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారతీయ వంటకాల్లో వెల్లుల్లి తప్పనిసరిగా ఉంటుంది. అంతే అంతే కాకుండా ఆయుర్వేదంలో వెల్లుల్లిని పూర్వం నుంచి ఉపయోగిస్తున్నారు. ఇందులో ఉండే ఎన్నో ఔషధ గుణాలు సర్వ రోగ నివారిణిగా పని చేస్తాయని ఆయుర్వేద వైద్యులు తరచూ చెబుతుంటారు. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు అధికంగా ఉంటాయి. అంతే కాకుండా వీటిని యాంటీ ఆక్సిడెంట్ల సమ్మేళనంగా కూడా పరిగణిస్తుంటారు. ఇంకా ఇందులో ఏమైనో యాసిడ్స్, అల్లిన్, అల్లిసిన్, అల్లైల్ ఫ్రొఫైల్ డైనోసల్ఫెట్ వంటివి కూడా ఉంటాయి. ఇవన్నీ ఆరోగ్యపరంగా ఎంతో మేలు చేస్తాయి. అందుకే ప్రతిరోజూ ఒకటి లేదా రెండు రెబ్బలు వెల్లుల్లి తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. అయితే దానికి ఉండే ఘాటైన వాసన కారణంగా వెల్లుల్లి తినడానికి చాలా మంది ఇష్టపడరు. .

కానీ సీజనల్ వ్యాధుల నుంచి తప్పించుకోవాలంటే వెల్లుల్లి కచ్చితంగా తినాలని చెబుతున్నారు ఆయుర్వేద నిపుణులు. వెల్లుల్లిలో రోగ నిరోధక శక్తిని పెంచే గుణాలు ఉంటాయి. తద్వారా చలికాలంలో తరచూ వేధించే జలుబు, దగ్గు, వంటి సమస్యల నుంచి త్వరగా బయట పడవచ్చు. ఇంకా చలికాలంలో వెచ్చగా ఉండేందుకు శరీర ఉష్ణోగ్రతను పెంచడంలో కూడా వెల్లుల్లి ఎంతగానో తోడ్పడుతుంది. అయితే వెల్లుల్లి వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నప్పటికి అధికంగా తింటే ముప్పు తప్పదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. వెల్లుల్లిలో సెలీనియం, జెర్మేనియం వంటి మూలకాలు ఉంటాయి. ఇవి నోటి దుర్వాసనకు కారణమౌతాయి, ఇంకా తీవ్రమైన దుర్వాసనతో కూడిన చెమట, గుండెల్లో మంట, ఎసిడిటీ, ఇలా చాలా సమస్యలే చుట్టుముట్టే అవకాశం ఉంది. కాబట్టి వెల్లుల్లి విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

Also Read:విజయవాడ – శ్రీశైలం మధ్య ‘సీ ప్లేన్’

- Advertisement -