‘సలార్ 2’కి – ‘సలార్ 3’కి మధ్య!

23
- Advertisement -

సలార్ రెండో భాగానికి కొనసాగింపుగా ‘సలార్’ మూడో పార్ట్ వుంటుందనే వార్తలు వచ్చిన తరువాత, వుండొచ్చనే హింట్‌ను టీమ్ ఇచ్చిన తరువాత ప్రభాస్ ఫ్యాన్స్ లో ఓ పక్క ఆనందం ఓ పక్క అయోమయం నెలకొంది. ప్రభాస్ ని పాన్ ఇండియా హీరోని చేసిన బాహుబలి సిరీస్ తర్వాత, ప్రభాస్ కెరీర్ కి ఉపయోగపడిన సినిమా అంటే.. అది కచ్చితంగా సలార్ సినిమా మాత్రమే. మరి అలాంటి సలార్ సినిమాకి కొనసాగింపు అంటే మంచి విషయమే. అందువల్ల ప్రభాస్ ఫ్యాన్స్ కు ఆనందమే.

కానీ, 2023 లో సలార్ వచ్చిన తరువాత, ప్రభాస్ నుంచి మరో సినిమా ఎప్పుడు వస్తోందో క్లారిటీ ఉండటం లేదు. అదే పెద్ద టెన్షన్. పెద్ద పెద్ద దర్శకులు ప్రభాస్ చుట్టూ తిరుగుతున్నారని వార్తలు వున్నాయి. కానీ, ప్రభాస్ ఏమో ‘మారుతి’ లాంటి చిన్న దర్శకులకు ఛాన్స్ లు ఇస్తున్నాడు. మొత్తానికి ప్రభాస్ సెలెక్షన్ పై ఆయన అభిమానుల్లో అసంతృప్తి ఉంది. పాన్ ఇండియా లెవెల్ భారీ యాక్షన్ థ్రిల్లర్ లు తీస్తున్న దర్శకులతో తమ హీరో వరుసగా సినిమాలు చేస్తే బాగుంటుంది అని ప్రభాస్ ఫ్యాన్స్ కోరిక.

అయితే, విశ్వసనీయ వర్గాల బోగట్టా ప్రకారం ‘సలార్ 2’కు కొనసాగింపు వుంటుందా ?, వుండదా? అన్నది ఇప్పుడే బయట పెట్టరని తెలుస్తోంది. ‘సలార్ 2’ విడుదల టైమ్ లోనే ఆ విషయంలో స్పష్టత ఇస్తారని తెలుస్తోంది. అలాగే, ‘సలార్ 2’ తరువాత ‘సలార్ 3’ చేసే లోగా వేరే పాన్ ఇండియా సినిమాలను చేసే ఆలోచనలోనే ప్రభాస్ కూడా వున్నారని తెలుస్తోంది. అయితే, ఇక్కడ ఒకటే కండిషన్. ప్రభాస్ ని మెప్పించే రెడీ మేడ్ స్క్రిప్ట్ ఎవరు తెస్తే వారికి చాన్స్ వుంటుంది. ఇక్కడే ప్రభాస్ కూడా తప్పు చేస్తున్నాడు. క్రేజీ కంబినేషన్లను సెట్ చేసుకోవడంలో ప్రభాస్ తడబడుతున్నాడు.

Also Read:అనాసతో ఆరోగ్య ప్రయోజనాలు!

- Advertisement -