గంగూలీకి యాంజియోప్లాస్టీ చేసిన వైద్యులు…

194
ganguly
- Advertisement -

అనారోగ్యం కారణంతో తిరిగి ఆస్పత్రిలో చేరిన బీసీసీఐ చీఫ్ గంగూలీకి యాంజియోప్లాస్టీ చేశారు వైద్యులు. ఈ చికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. రెండు స్టంట్‌లు గంగూలీకి అమర్చగా దాదా ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు వెల్లడించారు.

ప్రస్తుతం ఆయనను జాగ్రత్తగా పర్యవేక్షిస్తున్నాం. ఆపరేషన్‌కు ముందు పలు వైద్య పరీక్షలు నిర్వహించాం అని డాక్టర్లు వెల్లడించారు. జనవరి 2న స్వల్ప గుండెపోటు రావడంతో ఆయనకు యాంజియోప్లాస్టీ ద్వారా ఒక స్టెంట్‌ను అమర్చారు. తాజాగా మరోసారి ఛాతీలో అసౌకర్యం ఏర్పడటంతో ఇంకో రెండు స్టెంట్‌లు వేశారు.

- Advertisement -