టీమిండియా మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీని పెను ప్రమాదం తప్పింది. పశ్చిమ బెంగాల్‌లోని బుర్ద్వాన్‌లోని ఓ యూనివర్సిటీలో ఓ కార్యక్రమంలోనే పాల్గొనేందుకు గంగూలీ తన రేంజ్‌రోవర్ కారులో ప్రయాణిస్తున్నాడు. అతడి కారుతో పాటు మరో రెండు కార్లు కూడా కాన్వాయ్‌లా వెంట వెలుతున్నాయి.
దుర్గాపూర్ ఎక్స్‌ప్రెస్‌వేలోని దంతన్‌పూర్ వద్ద ఓ లారీ అకస్మాత్తుగా గంగూలీ కాన్వాయ్‌ను ఓవర్‌టేక్ చేసేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో కాన్వాయ్‌కు అడ్డుగా వచ్చింది. దీంతో డ్రైవర్ సడెన్ బ్రేక్ వేయగా కాన్వాయ్‌లోని కార్లు అదుపుతప్పాయి. ఒకదానికొకటి ఢీ కొన్నాయి. వాటిలో ఒకటి గంగూలీ కారును ఢికొట్టింది. అయితే.. అదృష్ట వశాత్తు ఈ ఘటనలో ఎవ్వరికి ఎలాంటి గాయాలు కాలేదు.
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అధ్యక్షుడిగానూ పని చేశారు గంగూలీ. మహిళల ప్రీమియర్ లీగ్ (WPL)లో ఢిల్లీ క్యాపిటల్స్ మహిళా జట్టుతో సహా అన్ని క్రికెట్ వెంచర్‌లను పర్యవేక్షిస్తున్నారు.
Also Read:అక్షర్ పటేల్ హ్యాట్రిక్ మిస్..