నాణ్యతా ను బట్టి ధాన్యం కొనుగోలు కేంద్రాలని ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు మంత్రి ఈటల రాజేందర్. కరీంనగర్ జిల్లా యాక్షన్ ప్లాన్ సమీక్షా సమావేశంలో మాట్లాడిన ఆయన ధాన్యం రవాణాలో ఇబ్బందులు జరగకుండా చర్యలు చేపట్టాలన్నారు. రైస్ మిల్లుల్లో ట్రాన్స్ ఫోర్ట్ వాహనాలు ఎక్కువ నిరీక్షించకుండా చూడాలి..గోదాముల్లో నిల్వ ఉన్న ధాన్యాన్ని త్వరగా షీప్ట్ చేయాలన్నారు.
గన్ని సంచుల కొరత లేకుండా అధికారులు ఏర్పాటు చేయాలన్నారు మంత్రి కొప్పుల ఈశ్వర్. రవాణాకు సంబంధించిన సమస్యలు రాకుండా చూడాలి… ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అధికారులు పూర్తి స్థాయిలో సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు. ఎక్కువ ధాన్యం వస్తున్న గ్రామాల్లో అవసరం అయితే రెండు సెంటర్లు ఏర్పాటు చేయాలి…రైతులు ఒకేసారి మార్కెట్ కి రాకుండా…దఫాల వారిగా మార్కెట్ కి వచ్చే విధంగా గైడ్ చేయాలన్నారు.
తెలంగాణలో పండిన ప్రతి పంట కొనాలి అని సీఎం కేసీఆర్ సూచించారని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ప్రతి ధాన్యపు గింజ కొంటామని ప్రకటించిన రాష్ట్రం దేశంలో తెలంగాణ ఒకటేనని..ప్రతీ గ్రామం లో ఏ రైతు ఎంత పండించారు అనే వివరాలు అధికారులు తెలుసుకోవాలన్నారు. చెక్ పోస్టులు పెట్టి ఇతర రాష్ట్రాల నుండి వచ్చే వరి పంట పై దృష్టి పెట్టాలన్నారు.
జగిత్యాల 5 లక్షల మెట్రిక్ టన్నులు,కరీంనగర్ 5 లక్షల మెట్రిక్ టన్నులు,పెద్డపల్లి 4 మెట్రిక్ టన్నులు,సిరిసిల్ల 2 లక్షల మెట్రిక్ టన్నుల వరి దిగుబడి ఉండే అవకాశం ఉందని సివిల్ సప్లై కమిషనర్ ఆకూన్ సబర్వాల్ అన్నారు. మొత్తం 16 లక్షలు మెట్రిక్ టన్నుల వరి దిగుబడి అవుతుందని అంచనా వేశారు. గతంలో కంటే 6 లక్షల మెట్రిక్ అదనంగా వరి దిగుబడి కానుందన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ప్రణాళిక బద్దంగా కొనుగోళ్లు చేస్తే రైతులకు ఇబ్బందులు కలగవని తెలిపిన సబర్వాల్ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ధాన్యం కొనుగోలు చేయవద్దన్నారు.