కరీంనగర్ ఎమ్మెల్యు గంగుల కమలాకర్ టీఆర్ఎస్‌ను వీడుతున్నారని తప్పుడు కథనాన్ని ప్రచురించగా ఆ వార్త వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న యూ ట్యూబ్ ఛానల్‌పై డీజీపీ ఫిర్యాదు చేశారు గంగుల.
టీఆర్ఎస్‌ని వీడేది లేదంటూ ప్రకటించిన కమలాకర్ ….బీజేపీలో చేరుతున్నట్లు నిరాధారమైన కథనాలను ప్రసారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. సదరు ఛానల్‌పై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని..ఇలాంటి కథనాల వల్ల తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలుగుతున్నదని పోలీసులకు సైతం ఫిర్యాదు చేశారు. ఆయన అనుచరులు సైతం నాలుగు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు.
తన తుది శ్వాస ఉన్నంత వరకు టీఆర్ఎస్‌లోనే ఉంటానని, ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్‌ల ఆశయాల మేరకు వారి అడుగుజాడల్లో పనిచేస్తానని ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు నియోజకవర్గ ప్రజలు ఈ తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.
తాను టీఆర్ఎస్ సైనికుడినని…పార్టీ పటిష్టత కోసమే కృషి చేస్తానని చెప్పారు. వరుసగా కరీంనగర్‌లో మూడు పర్యాయాలు విజయం సాధించడాన్ని చూసి ఓర్వలేని అసాంఘికశక్తులు తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు కుట్ర చేస్తున్నాయంటూ మండిపడ్డారు.

