కాంగ్రెస్‌ బీసీల వ్యతిరేకి

0
- Advertisement -

కాంగ్రెస్ మొదట్నుంచి బీసీ ల వ్యతిరేకి అన్నారు మాజీ మంత్రి గుంగుల కమలాకర్. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన గంగుల.. బీహార్ కులగణన ను పాట్నా హై కోర్టు కొట్టేసింది …బీసీ కమిషన్ ద్వారా సర్వే చేయకుండా ప్లానింగ్ డిపార్ట్ మెంట్ ద్వారా చేస్తే కోర్టు కొట్టేసింది ..రాష్ట్రం లో కూడా అలాంటి పొరపాటే జరిగింది అన్నారు.

రకరకాల సందర్భాల్లో రకరకాల జీవో లు ఇచ్చారు ..కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన తప్పుల తో బీసీ జాతికి అన్యాయం జరిగింది …నిన్న రేవంత్ రెడ్డి మమ్మల్ని బుల్డోజ్ చేశారు ..బుల్డోజ్ చేస్తే భయపడటానికి మేము గొర్రెలమా ?…సగం ఇండ్లకు సర్వే చేసే వారు వెళ్లనే లేదు ..పదేళ్లకు జనాభా పెరుగుదల 13 శాతం ఉంటుంది ..ఆ లెక్క ప్రకారం 4 కోట్ల 25 లక్షల జనాభా ఉంటుంది అన్నారు.

Also Read:TTD:అన్యమత ఉద్యోగులపై బదిలీ వేటు

3 కోట్ల 75 లక్షల జనాభా కు కులగణన పరిమితం చేసింది ..దాదాపు 40 లక్షల బీసీ జనాభా ను కనుమరుగు చేసింది ..ముస్లింలు కలపకుండానే బీసీ ల జనాభా 56 శాతం పైనే ఉంటుంది ..కేవలం 46 శాతం చూపారు ..అన్ని కులాల శాతం పెరిగింది ..బీసీ ల జనాభా కావాలనే పది శాతం తగ్గించారు …పాలకులకు బీసీ లంటే భయం …కేంద్ర ప్రభుత్వం చేసే నేషనల్ ఫామిలీ హెల్త్ సర్వే ప్రకారం 2024 వరకు జనాభా 3 కోట్ల 84 లక్షలు ..నేషనల్ శాంపిల్ సర్వే ప్రకారం బీసీ ల జనాభా 56 శాతం
..అశాస్త్రీయంగా కుల గణన చేశారు .ఎవరైనా కోర్టు కు పోతే ఈ రిపోర్టు ను కొట్టేస్తారు ..మిగతా కాంగ్రెస్ ప్రభుత్వాలు బీసీ లను తొక్కేసినట్టే రేవంత్ సర్కారు తొక్కేస్తోంది..రీ సర్వే చేయాలి ..ఒక్క రోజును సర్వే కోసం కేటాయించండి ..15 రోజుల్లో సర్వే మొదలుపెట్టండి ..ఓటర్ లిస్ట్ తయారు చేసినట్టు బీసీ ల గణన చేయాలి..మళ్ళీ సర్వే చేస్తే బీసీ ల జనాభా 56 శాతం వస్తుంది అన్నారు.

- Advertisement -