కృష్ణ చైతన్య దర్శకత్వంలో విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మించారు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది.
ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫస్ట్ డే రూ.8.2 కోట్లు వసూళ్లు చేసినట్లు మేకర్స్ తెలిపారు. వీకెండ్ కావడంతో ఈ కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది. హీరోది గోదావరిలోని ఓ లంకగ్రామం. పేరు లంకల రత్నాకర్(విశ్వక్‌సేన్). వృత్తి దొంగతనం. జీవితంలో ఎలాగైనా ఎదగాలనేది ఇతని లక్ష్యం. దానికోసం ఎందర్నయినా బురిడీ కొట్టించేస్తుంటాడు.
ఆ ఏరియాలో.. నానాజీ(నాజర్), దొరస్వామిరాజు(గోపరాజు రమణ)ల ఆధిపత్యపోరు నడుస్తుంటుంది. వీరిలో దొరస్వామిరాజు ఆ ప్రాంత ఎమ్మెల్యే. దాంతో ఎలాగొలా దొరస్వామిరాజు పంచన చేరతాడు రత్నాకర్. ఆ తర్వాత ఏం జరుగుతుంది? అనేదే సినిమా కథ.
Also Read;Gas price:తగ్గిన గ్యాస్ ధరలు..